PC: IPL.com
Gujarat Titans vs Chennai Super Kings: ఐపీఎల్-2023లో గెలుపు జోష్ మీద ఉన్న గుజరాత్ టైటాన్స్‌కు బిగ్ షాక్ తగిలే అవకాశం ఉంది. సీఎస్‌కేతో జరిగిన తొలి మ్యాచ్‌లో గాయపడిన గుజరాత్ స్టార్ బ్యాటర్ కేన్ విలియమ్సన్.. ఈ మెగా టోర్నీ మొత్తానికి దూరం కానున్నట్లు తెలుస్తోంది.
ఏం జరిగిందంటే?
సీఎస్‌కే ఇన్నింగ్స్ 13వ ఓవర్లో జోషువా లిటిల్ వేసిన బంతిని చెన్నై ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ డీప్ స్క్వే్ర్ లెగ్ దిశగా ఆడాడు. ఈ క్రమంలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న విలియమ్సన్.. గాల్లోకి ఎగిరి దాన్ని అందుకునే ప్రయత్నం చేశాడు. అయితే తను బ్యాలెన్స్ తప్పానని గ్రహించిన కేన్‌మామ బంతిని మైదానంలో విసిరేసి తన జట్టుకు రెండు పరుగులను సేవ్‌చేశాడు.
అయితే బంతిని అపే క్రమంలో అతడి మోకాలు నేలను బలంగా తాకింది. దీంతో నొప్పితో అతడు విల్లావిల్లాడు. ఫిజియో వచ్చి చికిత్స అందించినప్పటికి అతడి నొప్పి తగ్గలేదు. దీంతో అతడు సహాచర ఆటగాళ్ల సాయంతో మైదానాన్ని వీడాడు. దీంతో అతడి స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా సాయిసుదర్శన్ బ్యాటింగ్ వచ్చాడు. కాగా విలియమ్సన్ గాయం తీవ్రతపై గుజరాత్ టైటాన్స్ ఇప్పటివరకు ఎటువంటి అప్‌డేట్ ఇవ్వలేదు.
కానీ మ్యాచ్ అనంతరం గుజరాత్ టైటాన్స్ హెడ్‌కోచ్ గ్యారీ కిర్‌స్టన్ చేసిన వ్యాఖ్యల ప్రకారం.. కేన్ ఐపీఎల్ మొత్తానికి దూరం కానున్నట్లు సృష్టం అవుతోంది. "విలియమ్సన్‌కు మోకాలికి తీవ్ర గాయమైంది. అతడిని మా ఫిజియోలు పరిశీలిస్తున్నారు. కేన్‌ను స్కానింగ్‌కు కూడా పంపించారు.
రిపోర్ట్స్ వచ్చాక గాయం తీవ్రత తెలుస్తోంది. అతడు తిరిగి మళ్లీ మైదానంలో అడుగుపెడతాడు అని" ఆశిస్తున్నాను అని కిర్‌స్టన్ పేర్కొన్నాడు. మరోవైపు న్యూజిలాండ్ హెడ్ కోచ్ గ్యారీ స్టెడ్ సైతం కేన్ గాయంపై స్పందించాడు. అతడికి తీవ్ర గాయమైనట్లు స్టెడ్ తెలిపాడు. అతడికి గాయం కావడం మాకు జట్టుకు కోలుకోలేని ఎదురుదెబ్బ అని స్టెడ్ పేర్కొన్నాడు.
చదవండి: WC 2023: చెలరేగిన మగల, బవుమా.. వెస్టిండీస్ పాలిట శాపంలా సౌతాఫ్రికా! ‘ప్రపంచకప్’ రేసులో..
Comments
Please login to add a commentAdd a comment