Video Viral: KL Rahul Asks Teammates to not celebrate Bhuvneshwar Kumars wicket - Sakshi
Sakshi News home page

IPL 2022: 'ఏంటి రాహుల్‌ భయపడ్డావా, ఫైన్‌ వేస్తారని'.. వీడియో వైరల్‌!

Published Tue, Apr 5 2022 1:57 PM | Last Updated on Tue, Apr 5 2022 3:52 PM

KL Rahul Asks Teammates to not celebrate Bhuvneshwar Kumars wicket - Sakshi

Courtesy: IPL Twitter

ఐపీఎల్‌-2022లో భాగంగా సోమవారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌ 13 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ ఇన్నింగ్స్‌ అఖరి ఓవర్‌ వేసిన జాసన్‌ హోల్డర్‌ బౌలింగ్‌లో.. భువనేశ్వర్‌ కుమార్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్‌ కీపర్‌ డికాక్‌ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో డికాక్‌ను అభినందిస్తూ సహచర ఆటగాళ్లు సెలబ్రేషన్స్‌ జరుపుకున్నారు. ఆ క్రమంలో కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ మాత్రం సెలబ్రేషన్స్‌ వద్దు టైం అవుతోంది అంటూ సైగలు చేశాడు.

అయితే మ్యాచ్‌ కటాఫ్ సమయం దగ్గరపడడంతో.. గేమ్‌ను త్వరగా ముగించాలని రాహుల్‌ భావించాడు. అందుకే ఆ సైగలు చేసినట్లు తెలుస్తోంది.మ్యాచ్‌ నిర్ణీత సమయంలో ముగించకపోతే స్లో ఓవర్‌ రేట్‌ కారణంగా ఫైన్‌ విధించే అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ స్పందిస్తూ.. ఏంటి రాహుల్‌ భయపడ్డావా, ఫైన్‌ వేస్తారని అని కామెంట్‌ చేశాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 68 పరుగులు సాధించి లక్నో విజయంలో కీలక పాత్ర పోషిం‍చాడు.

చదవండి: IPL 2022: 'ఎస్‌ఆర్‌హెచ్‌కు 6.5 కోట్లు దండగ.. మరీ దారుణంగా ఆడుతున్నాడు'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement