కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. రోహిత్‌, కోహ్లి సరసన.. | KL Rahul scores his 50th T20 half century, joins the elite list | Sakshi
Sakshi News home page

IPL 2022: కేఎల్‌ రాహుల్‌ అరుదైన రికార్డు.. రోహిత్‌, కోహ్లి సరసన..

Published Tue, Apr 5 2022 10:08 AM | Last Updated on Tue, Apr 5 2022 11:31 AM

KL Rahul scores his 50th T20 half century, joins the elite list - Sakshi

కేఎల్‌ రాహుల్‌( Courtesy: IPL Twitter)

టీమిండియా స్టార్‌ ఆటగాడు, లక్నో సూపర్‌ జెయింట్స్‌ కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ టీ20ల్లో అరుదైన ఘనత సాధించాడు. టీ20ల్లో 50 అర్ధసెంచరీలు సాధించిన ఐదో భారత ఆటగాడిగా రికార్డులకెక్కాడు. ఐపీఎల్‌-2022లో భాగంగా సన్‌రైజెర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ద సెంచరీ చేసిన రాహుల్‌ ఈ ఘనత సాధించాడు.

ఈ మ్యాచ్‌లో రాహుల్‌ 50 బంతుల్లో 68 పరుగులు చేశాడు. కాగా రాహుల్‌కు ఐపీఎల్‌లో ఇది 28వ అర్ధసెంచరీ. ఇక ఈ ఘనత సాధించిన జాబితాలో తొలి స్థానంలో టీమిండియా మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఉన్నాడు. అతడు 76 అర్దసెంచరీలు సాధించాడు.

టీ20ల్లో అత్యధిక అర్ధసెంచరీలు సాధించిన భారత ఆటగాళ్లు
విరాట్‌ కోహ్లి(328 మ్యాచ్‌లు)- 76 అర్ధ సెంచరీలు
రోహిత్‌ శర్మ(372 మ్యాచ్‌లు )- 69 అర్ధ సెంచరీలు
శిఖర్‌ ధావన్‌(305 మ్యాచ్‌లు)- 63 అర్ధ సెంచరీలు
సురేష్‌ రైనా  (336 మ్యాచ్‌లు)-53 అర్ధ సెంచరీలు
కెఎల్‌ రాహుల్‌(175 మ్యాచ్‌లు)-50 అర్ధ సెంచరీలు

చదవండి: IPL 2022 SRH Vs LSG: అంతా మీరే చేశారు... సీజ‌న్ మొత్తం ఇదే కంటిన్యూ అవుతుంది!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement