BGT 2023.. మరో రెండు రోజుల్లో టీమిండియా, ఆస్ట్రేలియాల మధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు తెరలేవనుంది. నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9న ఇరుజట్ల మధ్య తొలిటెస్టు జరగనుంది. ఇప్పటికే ఇరుజట్లు తమ ప్రాక్టీస్‌లో తలమునకలయ్యాయి. ఆసీస్ తమకు అలవాటైన ధోరణిలోనే స్లెడ్జింగ్‌కు దిగింది. ఈసారి భారత్‌పై తాము ఆధిపత్యం చెలాయిస్తామంటూ గొప్పలు చెప్పుకుంటుంది. మరి టీమిండియా బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని ఫలితం సాధిస్తారో లేక స్పిన్నర్ల దెబ్బకు తోకముడుస్తారో చూడాలి.
ఇదిలా ఉంటే.. తొలిటెస్టుకు ముందు వైస్ కెప్టెన్ హోదాలో కేఎల్ రాహుల్ మీడియా ముందుకు వచ్చాడు. మంగళవారం సాయంత్రం నిర్వహించిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో కేఎల్ రాహుల్ స్పందించాడు. తుది జట్టు ఎలా ఉండబోతుందన్న ప్రశ్నకు రాహుల్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.
''నిజం చెప్పాలంటే మేము ఎలాంటి ప్రణాళికలు రచించలేదు.టెస్టు, వన్డేలు, టి20లు ఇలా ఒక్కో ఫార్మాట్‌లో ఒక్కో ఆటతీరు ఉంటుంది. కాబట్టి ఇలా ఆడాలి? అలా ఆడాలి? అని ఆలోచించం. ఒక బౌలర్‌ను ఎలా ఎదుర్కోవాలి? అనే విషయంలో వ్యక్తిగత వ్యూహాలు ఉంటాయి. భారత్‌లో పిచ్‌లు ఎప్పుడు.. ఎలా స్పందిస్తాయో ఎవరికీ తెలియవు. నాగ్‌పూర్ పిచ్‌ని చూస్తుంటే ముగ్గురు స్పిన్నర్లని తీసుకోవాలనే ఉబలాటం కలుగుతోంది.
అయితే.. ఇప్పటికైతే ఎంత మంది స్పిన్నర్లని తుది జట్టులో ఆడించాలి? అనేదానిపై నిర్ణయం తీసుకోలేదు. మ్యాచ్‌కి ముందు రోజు లేదా మ్యాచ్‌కి ముందు తుది నిర్ణయం తీసుకుంటాం. ఇక నేను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తాను అనేది జట్టు నిర్ణయం. ఒకవేళ నా సేవలు మిడిలార్డర్‌లో అవసరం అనుకుంటే అక్కడే వస్తాను.. లేదు ఓపెనర్‌గా కావాలనుకుంటే అందుకు కూడా రెడీ.. పరుగులు చేయడమే ముఖ్యం.'' అని చెప్పుకొచ్చాడు.
వాళ్లతో సవాల్‌కు రెడీ
బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీలో స్పిన్నర్లు కీలకం కానున్నారు. భారత పిచ్‌లపై స్పిన్నర్లకు టర్న్ ఎంతలా లభిస్తుందో చెప్పలేమని, అందుకని నెట్ ప్రాక్టీస్‌లో స్పిన్నర్లను ఎదుర్కోవడంపై దృష్టి పెట్టాంమని రాహుల్ వెల్లడించాడు. ''ఆసీస్ బ్యాటింగ్ లైనప్‌లో డేవిడ్ వార్నర్, ఉస్మాన్ ఖవాజా, ట్రావిస్ హెడ్ లాంటి లెఫ్ట్ హ్యాండర్లు ఉన్నారు. కుడి చేతివాటం, ఎడమ చేతివాటం బ్యాటర్ల జోడీ బౌలర్లను ఇబ్బంది పెడతారు. అయితే.. అవ్విన్, సిరాజ్, జడేజా వాళ్లను కట్టడి చేసేందుకు సిద్ధంగా ఉన్నారని'' రాహుల్ వివరించాడు.
ఇక ఇటీవలే తన గర్ల్‌ఫ్రెండ్ అతియాశెట్టిని వివాహమాడిన కేఎల్ రాహుల్ కివీస్‌తో జరిగిన మూడో వన్డేలో అర్థశతకంతో రాణించాడు. హాఫ్ సెంచరీతో టచ్‌లోకి వచ్చినట్లే కనిపిస్తున్నాడు. గతంలో 2017లో ఆస్ట్రేలియా భారత్ పర్యటనకు వచ్చినప్పుడు కేఎల్ రాహుల్ టీమిండియా తరపున మూడో టాప్‌స్కోరర్‌గా ఉన్నాడు. అప్పటి బోర్డర్-గావస్కర్ సిరీస్‌లో రాహుల్ ఆరు హాఫ్ సెంచరీల సాయంతో 393 పరుగుల చేశాడు. ఇటీవలే అంతగా ఫామ్‌లో లేని కేఎల్ రాహుల్ తాజాగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌లో గనుక రాణించకపోతే కెరీర్‌కు బ్రేక్ పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
With a place in the ICC World Test Championship Final up for grabs, how will #TeamIndia approach the #INDvAUS Test series 🤔
— BCCI (@BCCI) February 7, 2023
Here's what vice-captain @klrahul said ⬇️ pic.twitter.com/2F7kQI1f6z
చదవండి: రెండు దేశాల తరపున సెంచరీ.. టెస్టు క్రికెట్‌లో అరుదైన రికార్డు
'మేం కాదు మీరే..' పాక్ మాజీ కెప్టెన్‌కు దిమ్మతిరిగే కౌంటర్
Comments
Please login to add a commentAdd a comment