పుణె: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనతను సాధించాడు. స్వదేశంలో 10 వేల అంతర్జాతీయ పరుగులు పూర్తి చేసుకున్న రెండో భారత బ్యాట్స్‌మన్‌గా కోహ్లి నిలిచాడు. ఇంగ్లండ్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా పుణెలో జరుగుతున్న తొలి వన్డే మ్యాచ్‌లో కోహ్లి ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. అంతకుముందు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ ఘనతను నమోదు చేసిన తొలి టీమిండియా క్రికెటర్ కాగా, ఆ తర్వాత స్థానంలో కోహ్లి నిలిచాడు. ఇక్కడ చదవండి: Krunal Pandya: అరంగేట్రంలోనే ప్రపంచ రికార్డు..
ఇంగ్లండ్‌తో తొలి వన్డేలో కోహ్లి 56 పరుగులు సాధించాడు. హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న తర్వాత కోహ్లి ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. ఇది కోహ్లికి 61వ వన్డే హాఫ్ సెంచరీ. ఇంగ్లండ్‌తో మ్యాచ్‌లో ధవన్‌తో కలిసి రెండో వికెట్‌కు 105 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ధవన్ 98 పరుగులు సాధించి రెండు పరుగుల దూరంలో సెంచరీ కోల్పోయాడు. ఇక కేఎల్ రాహుల్ 62 పరుగులు సాధించి అజేయంగా నిలవగా, కృనాల్ పాండ్యా 58 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దాంతో టీమిండియా 50 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 317 పరుగులు చేసింది. ఇక్కడ చదవండి: సాఫ్ట్ సిగ్నల్.. మరోసారి రాజుకున్న వివాదం!
Comments
Please login to add a commentAdd a comment