ఇంగ్లండ్ పర్యటన ముగియగానే టీమిండియా వెస్టిండీస్ గడ్డపై ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ విండీస్ పర్యటనకు సంబంధించి 18 మందితో కూడిన జట్టును ప్రకటించింది. ముందుగా ఊహించినట్లుగానే ఫేలవ ప్రదర్శన కనబరుస్తున్న విరాట్ కోహ్లిని విండీస్‌తో సిరీస్‌కు పక్కనబెట్టారు. కోహ్లితో పాటు టీమిండియా స్పీడస్టర్ జస్‌ప్రీత్ బుమ్రా కూడా సిరీస్‌కు దూరమయ్యాడు. అయితే వీరిద్దరిని వర్క్‌లోడ్ పేరుతో దూరం పెట్టినట్లు బీసీసీఐ ఒక ప్రకటనలో తెలిపింది.
ఇక విండీస్‌తో వన్డేలకు రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మకు విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ సారథిగా వ్యవహరించనున్నాడు. ఇక జూలై 22 నుంచి 27 వరకు వన్డే సిరీస్ జరుగనుండగా.. విండీస్- టీమిండియా మధ్య జూలై 29 నుంచి పొట్టి ఫార్మాట్ సిరీస్‌కు మాత్రం రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ నాయకత్వం వహించనున్నాడు.
ఇక ఇంగ్లండ్‌తో జరిగిన టి20 సిరీస్‌లో విశేషంగా రాణించిన ఆల్‌రౌండర్ దీపక్ హుడా తన స్థానాన్ని నిలుపుకోగా.. గాయం నుంచి కోలుకొని కుల్దీప్ యాదవ్ తిరిగి జట్టులో చేరగా.. హెర్నియా ఆపరేషన్ అనంతరం కేఎల్ రాహుల్ కూడా సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే వీరిద్దరు ఫిట్‌నెస్ నిరూపించుకుంటూనే తుది జట్టులో చోటు దక్కే అవకాశం ఉంది. ఇక రవిచంద్రన్ తిరిగి టి20 జట్టులో చోటు సంపాదించాడు.
విండీస్‌తో టి20 సిరీస్‌కు 18 మందితో కూడిన భారత్ జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్, కేఎల్ రాహుల్*, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, శ్రేయాస్ అయ్యర్, దినేశ్ కార్తీక్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, ఆర్ అశ్విన్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్*, భువనేశ్వర్ కుమార్, అవేష్ ఖాన్, హర్షల్ పటేల్, అర్ష్‌దీప్ సింగ్
టీమిండియా, విండీస్ ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ షెడ్యూల్:
తొలి టి20: జూలై 29న
రెండో టి20: ఆగస్టు 1న
మూడో టి20: ఆగస్టు 2న
నాలుగో టి20: ఆగస్టు 6న
ఐదో టి20: ఆగస్టు 7న
Rohit Sharma (C), I Kishan, KL Rahul*, Suryakumar Yadav, D Hooda, S Iyer, D Karthik, R Pant, H Pandya, R Jadeja, Axar Patel, R Ashwin, R Bishnoi, Kuldeep Yadav*, B Kumar, Avesh Khan, Harshal Patel, Arshdeep Singh.
— BCCI (@BCCI) July 14, 2022
*Inclusion of KL Rahul & Kuldeep Yadav is subject to fitness.
చదవండి: ICC ODI WC Super League Standings: టాప్‌లోకి దూసుకువచ్చిన బంగ్లాదేశ్.. ఏడో స్థానంలో రోహిత్ సేన!
Comments
Please login to add a commentAdd a comment