టీమిండియా టెస్టు కెప్టెన్ విరాట్ కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో వన్డేలు ఆడడంపై క్లారిటీ ఇచ్చాడు. మంగళవారం కోహ్లి సౌతాఫ్రికా టూర్‌లో వన్డేలకు దూరంగా ఉన్నట్లు మీడియాలో పలు కథనాలు వచ్చాయి. అయితే వీటన్నింటికి కోహ్లి తన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమాధానమిచ్చాడు.
''నేను సౌతాఫ్రికా టూర్‌లో వన్డేలకు అందుబాటులో ఉంటా. నాకు విశ్రాంతి కావాలని నేనెప్పుడూ బీసీసీఐని కోరలేదు. మీడియాలో వచ్చే వార్తలు నమ్మదగినవి కావు. వన్డే కెప్టెన్సీ నుంచి తొలగించామని మాత్రమే సెలక్టర్లు చెప్పారు. అంతేకానీ వన్డేలకు దూరంగా ఉంటున్నట్లు నేను ఎక్కడా ప్రకటించలేదు.ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వేయడం ఆపండి. నా గురించి తప్పుడు వార్తలు రాసిన వారిని వెళ్లి అడగండి. వన్డేలకు సెలక్టర్లకు అందుబాటులో ఉంటా అని మరోసారి స్పష్టం చేస్తున్నా. కెప్టెన్సీ నుంచి తీసేసినంత మాత్రానా నాకు పెద్దగా నష్టమేమి ఉండదు.. ఒత్తిడి తగ్గి ఆటగాడిగా బాగా రాణించే అవకాశముంటుంది. రోహిత్ కెప్టెన్సీలో పనిచేయడం నాకు ఇష్టమే. మా మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయన్న మాటలు అవాస్తవం. వన్డేలు ఆడడానికి ఎంతో ఉత్సాహంతో ఉన్నా. ఇలాంటి పుకార్లు పుట్టించి సమయం వృథా చేయొద్దు.
బీసీసీఐ నన్ను కెప్టెన్సీ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మాత్రమే చెప్పింది. కానీ దీనిపై కనీసం నన్ను సంప్రదించకుండానే నిర్ణయం తీసుకుంది. ఇక వన్డే కెప్టెన్సీ తొలగింపు విషయంలో గంగూలీ నన్ను సంప్రదించారన్న వార్తలను ఖండిస్తున్నా. టి20 కెప్టెన్సీ నుంచి నాకు నేనుగా పక్కకు తప్పుకున్నప్పుడు ఎవరు ప్రశ్నించలేదు. వన్డే కెప్టెన్సీ తొలగింపుపై చివరి నిమిషంలో నాకు సమాచారమిచ్చారు. ఈ విషయంలో బీసీసీఐతో నాకు సరైన సంప్రదింపులు జరగలేదని మాత్రం చెప్పగలను.'' అని పేర్కొన్నాడు.
చదవండి: India Tour Of SA: కోహ్లి నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు
Comments
Please login to add a commentAdd a comment