ఫిఫా వరల్డ్‌కప్-2026లో ఫ్రాన్స్ స్టార్ ఫార్వర్డ్ కైలియన్ ఎంబపే అరుదైన ఘనత సాధించాడు. సెనెగల్‌తో జరిగిన గ్రూప్ దశ మ్యాచ్‌లో రెండు గోల్స్ నమోదు చేయడంతో వరల్డ్‌కప్ చరిత్రలో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజాలు లియోనల్ మెస్సీ, పీలేలను అధిగమించాడు. అలాగే తన దేశం తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాడిగానూ అవతరించాడు.
ఫిఫా వరల్డ్‌కప్‌లో అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లు:
క్లోస్ (జర్మనీ) – 16
రొనాల్డో (బ్రెజిల్) – 15
ముల్లర్ (జర్మనీ) – 14
ఎంబపే (ఫ్రాన్స్) – 14
మెస్సీ (అర్జెంటీనా) – 13
ఫోంటైన్ (ఫ్రాన్స్) – 13
పీలే (బ్రెజిల్) – 12
ఫ్రాన్స్ తరఫున అత్యధిక గోల్స్ చేసిన ఆటగాళ్లు:
ఎంబపే – 58
గిరౌద్ – 57
మ్యాచ్ విషయానికొస్తే.. ఎంబపే రెండు గోల్స్‌తో చెలరేగడంతో సెనెగల్‌పై ఫ్రాన్స్ 3-1 గోల్స్ తేడాతో గెలుపొందింది. న్యూజెర్సీ వేదికగా జరిగిన ఈ గ్రూప్-ఐ మ్యాచ్‌లో ఎంబపేతో పాటు ఫ్రాన్స్ తరఫున బ్రాడ్లే బర్కోలా మరో గోల్ చేశాడు.
66వ నిమిషంలో అద్భుతమైన పరుగుతో గోల్ సాధించిన ఎంబపే, ఆతర్వాత ఇంజరీ టైమ్‌లో (96వ నిమిషంలో) 25 గజాల దూరం నుంచి అద్భుత షాట్‌తో మరో గోల్ కొట్టి మ్యాచ్‌ను ఫ్రాన్స్ వైపు తిప్పేశాడు.
సెనెగల్ తరఫున ఇబ్రహీం ఎంబయే ఒక గోల్ సాధించి స్కోరు 2-1కు తగ్గించినా, వెంటనే ఎంబపే మెరుపు గోల్‌తో ఫ్రాన్స్ విజయాన్ని ఖాయం చేశాడు.
మ్యాచ్ మొత్తం ఎంబపే ఆధిపత్యం కనిపించింది. అతడు అత్యధికంగా నాలుగు షాట్లు ప్రయత్నించడమే కాకుండా, ప్రత్యర్థి బాక్స్‌లో ఏడు సార్లు బంతిని తాకాడు. ఈ మ్యాచ్‌లో ఎంబపే కెప్టెన్‌గానూ ఆకట్డుకున్నాడు. ఈ విజయంతో ఫ్రాన్స్ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ఘనంగా ప్రారంభించింది.


