
అర్జెంటీనా సూపర్‌స్టార్ మెస్సీ 2023 సంవత్సరానికిగాను పురుషుల విభాగంలో ‘ఫిఫా బెస్ట్ ప్లేయర్’గా నిలిచాడు. మెస్సీకి నార్వే ఫార్వర్డ్ ఎర్లింగ్ హాలాండ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. ఇద్దరు 48 పాయింట్లతో సమఉజ్జీగా నిలిచినప్పటికీ కెప్టెన్ల ప్యానెల్ నుంచి ఎర్లింగ్ కంటే మెస్సీకే ఎక్కువ ఓట్లు రావడంతో ‘ఫిఫా’ మెస్సీనే ఎంపిక చేసింది. మెస్సీ ఈ అవార్డును రికార్డు స్థాయిలో మూడోసారి (2019, 2022, 2023) గెలుచుకున్నాడు. మెస్సీ గతేడాది బాలన్ డి ఓర్ అవార్డు కూడా గెలుచుకున్నాడు.
ఈ ప్రతిష్టాత్మక అవార్డును కూడా మెస్సీ రికార్డు స్థాయిలో ఎనిమిది సార్లు కైవసం చేసుకున్నాడు. మెస్సీ ఫిఫా’ అత్యుత్తమ ప్లేయర్ అవార్డు గెలుచుకున్న అనంతరం మరో ఫుట్‌బాల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అతనికి శుభాకాంక్షలు తెలిపాడు. రొనాల్డో 2023 ఫిఫా అత్యుత్తమ ప్లేయర్ అవార్డు రేసులో లేకపోవడం విశేషం. కాగా, లీగ్‌లతో బిజీగా ఉండటంతో మెస్సీ అవార్డు ప్రధానోత్సవ వేడుకకు హాజరుకాలేదు.
Comments
Please login to add a commentAdd a comment