photo credit: IPL Twitter
ఐపీఎల్ 2023లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో ఇవాళ (ఏప్రిల్ 22) మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమైన మ్యాచ్‌లో 14 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్ ఓ అరుదైన క్లబ్‌లో చేరాడు. రాహుల్ తన టీ20 కెరీర్‌లో 7000 పరుగుల మార్కును అందుకున్నాడు. తన 210 మ్యాచ్‌ల కెరీర్‌లో రాహుల్ 42.42 సగటున 6 సెంచరీలు, 66 హాఫ్ సెంచరీల సాయంతో ఈ మార్కును అధిగమించాడు. ప్రపంచ క్రికెట్ చరిత్రలో రాహుల్‌కు ముందు 40 మంది మాత్రమే టీ20ల్లో 7000 పరుగుల మైలురాయిని అధిగమించారు. వీరిలో పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (44.14) ఒక్కడే రాహుల్ కంటే మెరుగైన సగటు కలిగి ఉన్నాడు.
కాగా, ప్రస్తుతం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్.. నిర్ణీత ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 135 పరుగుల నామమాత్రపు స్కోర్ చేసింది. గుజరాత్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా (37 బంతుల్లో 47; 6 ఫోర్లు), కెప్టెన్ హార్ధిక్ పాండ్యా (50 బంతుల్లో 66; 2 ఫోర్లు, 4 సిక్సర్లు) మాత్రమే రాణించారు. లక్నో బౌలర్లలో నవీన్ ఉల్ హాక్ (4-0-19-1), కృనాల్ పాండ్యా (4-0-16-2), స్టోయినిస్ (3-0-20-2), అమిత్ మిశ్రా (2-0-9-1) సత్తా చాటారు.
Comments
Please login to add a commentAdd a comment