ఆర్సీబీతో మ్యాచ్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌.. కేఎల్‌ రాహుల్‌కు గాయం | LSG VS RCB: KL Rahul Suffers From Cramp, Out Of Ground | Sakshi
Sakshi News home page

ఆర్సీబీతో మ్యాచ్‌.. లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ షాక్‌.. కేఎల్‌ రాహుల్‌కు గాయం

Published Mon, May 1 2023 8:05 PM | Last Updated on Mon, May 1 2023 9:00 PM

LSG VS RCB: KL Rahul Suffers From Cramp, Out Of Ground - Sakshi

లక్నోలోని అటల్‌ బిహారీ స్టేడియం వేదికగా ఆర్సీబీతో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్‌ జెయింట్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ జట్టు కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ బంతిని ఛేజ్‌ చేస్తూ తొడ కండరాలు పట్టేయడంతో మైదానన్ని వీడాడు. ఆర్సీబీ ఇన్నింగ్స్‌ రెండో ఓవర్‌ ఆఖరి బంతికి డుప్లెసిస్‌ కొట్టిన షాట్‌ను ఛేజ్‌ చేస్తూ రాహుల్‌ ఒక్క సారిగా కిందపడిపోయాడు.

లక్నో కెప్టెన్‌ నొప్పిని తట్టుకోలేక విలవిలలాడిపోయాడు. తొలుత అతన్ని తరలించేందుకు స్ట్రెచర్‌ను కూడా పిలిపించారు. అయితే కొద్దిసేపటికి అతను సహచరుల సాయంతో మైదానాన్ని వీడాడు. రాహుల్‌ గాయంపై స్పష్టత రావల్సి ఉంది. రాహుల్‌ గైర్హాజరీలో కృనాల్‌ పాండ్యా లక్నోకు సారధ్యం వహిస్తున్నాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఆర్సీబీ ఓపెనర్లు విరాట్‌ కోహ్లి (21), డుప్లెసిస్‌ (21) నిదానంగా ఇ​న్నింగ్స్‌ను ఆరంభించారు. 6 ఓవర్ల తర్వాత ఆ జట్టు వికెట్‌ నష్టపోకుండా 42 పరుగులు చేసింది.  పవర్‌ ప్లేలో ఆర్సీబీ 3 ఫోర్లు, ఓ సిక్సర్‌ మాత్రమే కొట్టింది. కృనాల్‌ పాండ్యా (3-0-14-0)  అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement