BGT 2023 Mahesh Pithiya- Ravichandran Ashwin: గుజరాత్ యువ క్రికెటర్ మహేశ్ పితియా తన ఆరాధ్య బౌలర్ రవిచంద్ర అశ్విన్‌ను కలిశాడు. టీమిండియా ప్రధాన స్పిన్నర్ అశూతో కలిసి ఫొటోలు దిగాడు. తనకు ఆదర్శప్రాయుడైన అశ్విన్ నుంచి ఆశీసులు అందుకున్నాననంటూ ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయ్యాడు. కాగా బోర్డర్- గావస్కర్ ట్రోఫీ నేపథ్యంలో బరోడా బౌలర్ మహేశ్ పితియా ఒక్కసారిగా స్టార్ అయిపోయిన సంగతి తెలిసిందే.
అశూ డూప్లికేట్
టీమిండియా స్పిన్నర్లను ఎదుర్కొనేందుకు మహేశ్‌తో కలిసి ఆస్ట్రేలియా బ్యాటర్లు నెట్స్‌లో ప్రాక్టీసు చేయడం క్రీడా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ మాదిరి బౌలింగ్ చేయగల మహేశ్ ఆసీస్ మేనేజ్‌మెంట్ ఆశ్రయించడం వార్తల్లో ప్రముఖంగా నిలిచింది.
దీంతో.. అశ్విన్ డూప్లికేట్ అంటూ అతడి పేరు సోషల్ మీడియాలో మారుమ్రోగిపోయింది. ఇక ఫిబ్రవరి 9 నుంచి టీమిండియా- ఆస్ట్రేలియా మధ్య నాలుగు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఇరుజట్లు ప్రాక్టీసులో తలమునకలయ్యాయి.
స్మిత్‌ను ఆరుసార్లు అవుట్ చేశా
ఈ సందర్భంగా మంగళవారం మహేశ్ పితియా అశ్విన్‌ను కలిశాడు. అశ్విన్‌ను పట్ల తనకున్న అభిమానం, ఆసీస్ జట్టుతో ప్రయాణంలో తన అనుభవాలు పంచుకున్నాడు. న్యూ ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘నెట్స్‌లో మొదటిరోజు స్టీవ్ స్మిత్‌ను కనీసం ఆరుసార్లు అవుట్ చేసి ఉంటా.
ఈ రోజు నేను నా రోల్‌మోడల్ అశ్విన్ నుంచి ఆశీర్వాదాలు పొందాను. తనలాగే బౌలింగ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటా. నెట్స్‌లోకి వెళ్లేటపుడు నేను ఆయను కలిశాను. పాదాలకు నమస్కరించి ఆశీసులు అందుకున్నా.
కోహ్లి బెస్టాఫ్ లక్ చెప్పాడు
వెంటనే ఆయన నన్ను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నాడు. నేను ఆస్ట్రేలియన్లకు ఎలా బౌలింగ్ చేశానో అడిగితెలుసుకున్నాడు. పక్కనే విరాట్ కోహ్లి కూడా చిరునవ్వుతోనే నన్ను పలకరించాడు. నాకు బెస్టాఫ్ లక్ చెప్పాడు’’ అని మహేశ్ పితియా హర్షం వ్యక్తం చేశాడు.
అదే విధంగా.. ‘‘ఆస్ట్రేలియా జట్టుతో ప్రయాణం అద్భుతంగా సాగింది. ప్రధానంగా స్టీవ్ స్మిత్‌కే నేను నెట్స్‌లో ఎక్కువగా బౌలింగ్ చేశాను. అయినా, స్మిత్ నాకిలానే కావాలని పట్టుబట్టలేదు. ఎలా బౌలింగ్ చేసినా ఎదుర్కొనేందుకు ట్రై చేసేవాడు.
అయితే, ఆ జట్టు స్పిన్నర్ లియోన్ మాత్రం నా దగ్గరికి వచ్చి నా బౌలింగ్ స్టైల్‌ను గమనించేవాడు. బంతిని డెలివరీ చేసేటపుడు నా వేళ్లను ఎలా తిప్పుతున్నా, గ్రిప్ ఎలా సాధిస్తున్నా అని పరిశీలించేవాడు. అంతేగాకుండా నాకు కొన్ని విలువైన సూచనలు, సలహాలు కూడా ఇచ్చేవాడు’’ అని మహేశ్ పితియా చెప్పుకొచ్చాడు.
చదవండి: Ajinkya Rahane: ఏమైపోయావు; రెండేళ్ల క్రితం హీరో.. ఇప్పుడు జీరో
Asha Kiran: కడు పేదరికం.. రూ. 1000 పెన్షనే ఆధారం.. చెప్పుల్లేకుండా రోజూ 7 కిమీ పరుగు.. స్వర్ణ పతకాలతో..
Comments
Please login to add a commentAdd a comment