పుణె: టీమిండియా యువ ఆటగాడు ప్రసీద్ కృష్ణపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్ ప్రశంసలు కురిపించాడు. చేజారుతుందనుకున్న మ్యాచ్‌ను భారత్ వైపు తిప్పడంలో కీలక పాత్ర పోషించాడన్నాడు. తొలి మ్యాచ్ అయినా ఎలాంటి తడబాటు లేకుండా ప్రత్యర్థి జట్టు బ్యాట్స్‌మెన్‌పై పైచేయి సాధించాడని ప్రశంసించాడు. ఇక యువ ఆటగాళ్లను తీర్చిదిద్దడంలో టీమిండియా మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ కృషి మరువలేనిదన్న మైకేల్.. బీసీసీఐ అనుసరిస్తున్న పద్ధతులు సత్ఫలితాలు ఇస్తున్నాయని కొనియాడాడు. ఈ మేరకు క్రిక్‌బజ్‌తో మాట్లాడిన మైకేల్ వాన్.. ‘‘ఆటగాళ్లను మెరికల్లా తీర్చిదిద్దడంలో తెర వెనుక యాజమాన్యం అవలంబిస్తున్న పద్ధతులు బాగున్నాయి. ప్రతిసారి మనం ఐపీఎల్ గురించి మాట్లాడతాం.
నిజానికి ఏ- జట్టును అభివృద్ధి చేయడంలో రాహుల్ ద్రవిడ్ పాత్ర అమోఘం. సరైన ఆలోచనావిధానంతో ముందుకు వెళ్లేలా ఆటగాళ్లను ప్రోత్సహిస్తున్నాడు. తద్వారా, ప్రెజర్ కుక్కర్‌లా భావించే అంతర్జాతీయ క్రికెట్‌లో వారు ఎలాంటి ఒత్తిడి లేకుండా రాణించగలుగుతున్నారు. ఇక కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రి సైతం డ్రెస్సింగ్‌రూంలో సానుకూల వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకుంటున్నారు’’ అని ప్రశంసలు కురిపించాడు. కాగా ఇంగ్లండ్‌తో జరిగిన మొదటి వన్డేలో అరంగేట్ర బౌలర్ ప్రసిద్ద్ కృష్ణ(4/54) అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.
చదవండి: అతడిని తుదిజట్టులోకి తీసుకోవాల్సింది: ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
కోహ్లిపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు
Comments
Please login to add a commentAdd a comment