కాన్పూర్ వేదికగా బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో టెస్టులో 7 వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. కేవలం మూడు రోజుల పాటు జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శతో బంగ్లాను భారత్ చిత్తు చేసింది. దీంతో రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-0 తేడాతో భారత్ క్లీన్ స్వీప్ చేసింది.
దీంతో భారత జట్టుపై సర్వాత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. కానీ ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైఖేల్ వాన్ మాత్రం మరోసారి టీమిండియాపై తన అక్కసును వెళ్లగక్కాడు. ఇంగ్లండ్ బ్రాండ్ క్రికెట్ 'బాజ్‌బాల్‌ను భారత్ కాపీ చేసిందని వాన్ ఆరోపించాడు.
నిజంగా ఇదొక అద్భుతమైన టెస్టు మ్యాచ్. నాలుగో రోజు ఆటలో భారత్ బ్యాటింగ్‌లో అదరగొట్టింది. భారత క్రికెటర్లు బాజ్‌బాలర్స్‌గా మారడం గొప్ప విషయం. కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఇంగ్లండ్ బ్యాటింగ్ స్టైల్‌ను కాపీ కొట్టారు' అని ఓ క్రికెట్ షోలో వాన్ పేర్కొన్నాడు. అయితే ఇదే షోకు కో హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఆసీస్ దిగ్గజం ఆడమ్ గిల్ క్రిస్ట్ వాన్‌కు కౌంటిరిచ్చాడు.
"వాన్ నీవు బాగానే ఉన్నావా? భారత్ ఆడింది బజ్‌బాల్ కాదు.. గాంబాల్. వారి హెడ్‌కోచ్ గంభీర్ ఇప్పటికే గాంబాల్‌పై పేటెంట్ పొందాడు. ఇప్పుడు ఇంగ్లండ్ కూడా జాగ్రత్తగా ఉండాలి" అని గిల్లీ వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇందుకు స్పందించిన వాన్.. భారత్ గాంబాల్ అచ్చెం బజ్‌బాల్ లానే ఉందంటూ చెప్పుకొచ్చాడు.
వర్షం కారణంగా రెండు రోజులు తుడిచిపెట్టుకుపోయిన తర్వాత నాలుగో రోజు ఆటలో భారత బ్యాటర్లు భీబత్సం సృష్టించారు. టీ20లను తలపిస్తూ కేవలం 34.4 ఓవర్లలో 285 పరుగులు చేసింది.
చదవండి: IND-W vs SA_W: దక్షిణాఫ్రికాను చిత్తు చేసిన భారత్..
Comments
Please login to add a commentAdd a comment