క్ష‌మాప‌ణ చెప్పిన‌ పీసీబీ చైర్మ‌న్‌! | Mohsin Naqvi Forced To Apologise Changes In Pakistan Super League | Sakshi
Sakshi News home page

క్ష‌మాప‌ణ చెప్పిన‌ పీసీబీ చైర్మ‌న్‌!

Mar 22 2026 6:21 PM | Updated on Mar 22 2026 6:23 PM

Mohsin Naqvi Forced To Apologise Changes In Pakistan Super League

ప‌శ్చిమాసియాలో భీక‌ర యుద్ధం పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ (పీఎస్ఎల్‌)పై ప్ర‌భావం చూపిస్తోంది. మార్చి 26 నుంచి ప్రారంభం కానున్న పాకిస్థాన్ సూప‌ర్ లీగ్ ప్రేక్ష‌కులు లేకుండానే జ‌రగ‌నుంది. యుద్ధం కార‌ణంగా త‌లెత్తిన చమురు సంక్షోభం, ఇంధ‌న ధ‌ర‌లు పెర‌గ‌డం ప్రేక్షకులు రావడానికి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉండడంతో ఖాళీ స్టేడియాల్లోనే మ్యాచ్‌లు నిర్వ‌హించాల‌ని పీఎస్ఎల్ నిర్వాహ‌కులు ఒక నిర్ణ‌యానికి వ‌చ్చారు. 

ఈ నేప‌థ్యంలో పీసీబీ చైర్మ‌న్ మోసిన్ న‌ఖ్వీ క్రికెట్ అభిమానుల‌కు క్ష‌మాప‌ణ చెప్పారు. 'ప‌శ్చిమాసియాలో యుద్ధ ప్ర‌భావం కార‌ణంగా దేశంలో ఇంధ‌న సంక్షోభం త‌లెత్తింది. దీంతో పాకిస్థాన్ ప్ర‌జ‌లంద‌రూ త‌మ రాక‌పోక‌ల‌ను ప‌రిమితం చేసుకోవాల‌ని ప్ర‌ధాని కోరారు. ప‌రిస్థితుల‌న్నింటిని గ‌మనించి, మా భ‌ద్ర‌తా సంస్థ‌ల‌తో చ‌ర్చించిన త‌ర్వాతే ప్రేక్ష‌కులు లేకుండా పీఎస్ఎల్‌ను నిర్వ‌హించాల‌నే నిర్ణ‌యానికి వ‌చ్చాం. 

10 నుంచి 15 రోజుల పాటు పీఎస్ఎల్‌లో అన్ని మ్యాచ్‌లు ఖాళీ స్టేడియాల్లోనే జ‌రుగుతాయి. ఫైన‌ల్ వ‌ర‌కు ప్రేక్ష‌కుల‌ను అనుమ‌తించే విష‌య‌మై ఆలోచిస్తాం.  ఇక టోర్నీ మొత్తం కూడా లాహోర్‌, క‌రాచీ వేదిక‌ల్లోనే జ‌రుగుతుంది. అంతేకాదు చ‌మురు సంక్షోభం కార‌ణంగా పీఎస్ఎల్ ప్రారంభ వేడుక‌ల‌ను కూడా ర‌ద్దు చేశాము. 

అయితే ఖాళీ స్టేడియాల్లో మ్యాచ్‌లు నిర్వ‌హిస్తుండ‌డంతో గేట్ రెవెన్యూలో వ‌చ్చిన న‌ష్టానికి ఫ్రాంచైజీల‌కు న‌ష్ట‌ప‌రిహారం చెల్లించ‌నున్నాం. అఫ్గానిస్థాన్‌కు స‌రిహ‌ద్దుగా ఉండ‌డంతో పెషావ‌ర్ స్టేడియంను మ్యాచ్‌ల నిర్వ‌హ‌ణ నుంచి తొల‌గించినందుకు కూడా న‌ఖ్వీ క్ష‌మాప‌ణ‌లు చెబుతున్నా' అంటూ పేర్కొన్నాడు.

చదవండి: లక్నో సూపర్‌జెయింట్స్‌ కథ మారేనా?

Advertisement
 
Advertisement
Advertisement