Mohsin Naqvi
-
CT 2025: టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడే.. ఐసీసీ నిర్ణయం ఇదే
చాంపియన్స్ ట్రోఫీ విషయంలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) మాట నెగ్గింది. బీసీసీఐ పట్టుబట్టినట్లుగానే హైబ్రిడ్ మోడల్‌తో చాంపియన్స్ ట్రోఫీని నిర్వహించాలని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిర్ణయించింది. ఈ మేరకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) అధ్యక్షుడు మొహ్సిన్ నక్వీతో శనివారం స్వయంగా ప్రకటన వెలువరించేందుకు ఏర్పాట్లు చేసింది. పీసీబీ చీఫ్ శనివారం ఇందుకు సంబంధించి ప్రకటన చేస్తారని ఐసీసీ వర్గాలు తెలిపాయి.టీమిండియా మ్యాచ్‌లన్నీ అక్కడేమరోవైపు.. ఐసీసీ చైర్మన్, బీసీసీఐ మాజీ కార్యదర్శి జై షా బ్రిస్బేన్ నుంచి వర్చువల్ ఈ సమావేశంలో పాల్గొని అధికారికంగా ప్రకటన చేస్తారని తెలిసింది. వచ్చే ఏడాది జరిగే చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా ఆడే మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో నిర్వహిస్తారు. చిరకాల ప్రత్యర్థుల మ్యాచ్‌లు అన్నీ ఇక హైబ్రిడ్ పద్ధతిలోనేఇదొక్క టోర్నీయే కాదు... ఇకపై అన్ని ఐసీసీ టోర్నీలకు చిరకాల ప్రత్యర్థుల మధ్య జరిగే మ్యాచ్‌లు హైబ్రిడ్ పద్ధతిలోనే నిర్వహిస్తారు. అంటే వచ్చే ఏడాది భారత్‌లో జరిగే మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆడేందుకు పాకిస్తాన్ ఇక్కడకు రాదు. భారత్ మాదిరే పాక్ మ్యాచ్‌ల్ని కూడా తటస్థ వేదికపై నిర్వహిస్తారు. అదే విధంగా.. 2026లో భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చే పురుషుల టీ20 ప్రపంచకప్ కూడా హైబ్రిడ్ పద్ధతిలోనే జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యాకాగా వన్డే వరల్డ్‌కప్-2023 ప్రదర్శన ఆధారంగా ఆస్ట్రేలియా, టీమిండియా, అఫ్గనిస్తాన్, సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025కి అర్హత సాధించిన విషయం తెలిసిందే. అయితే, డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగా టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ దక్కించుకుంది. ఫలితంగా నేరుగా ఈ ఈవెంట్‌కు క్వాలిఫై అయింది.అయితే, భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియాను పాకిస్తాన్‌కు పంపేందుకు బీసీసీఐ నిరాకరించింది. భారత విదేశాంగ శాఖ సైతం బోర్డు నిర్ణయాన్ని సమర్థించింది. ఈ నేపథ్యంలో అనేక చర్చల అనంతరం టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికపై నిర్వహించేందుకు పీసీబీ అంగీకరించింది. వేదిక మొత్తాన్ని తరలిస్తామంటూ ఐసీసీ కఠిన చర్యలు చేపట్టేందుకు సిద్ధం కావడంతో పట్టువీడి హైబ్రిడ్ మోడల్‌కు ఒప్పుకొంది. అయితే, తాము కూడా ఐసీసీ ఈవెంట్ల కోసం ఇకపై భారత్‌లో పర్యటించబోమన్న షరతు విధించినట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.చదవండి: Vijay Merchant Trophy: సెంచరీతో చెలరేగిన ద్రవిడ్ చిన్న కుమారుడు.. బౌండరీల వర్షం -
డబ్బు కోసం అలా చేయము: పట్టువీడని పాకిస్తాన్.. ఐసీసీ నిర్ణయం?
చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ అంశంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక వ్యాఖ్యలు చేశాడు. డబ్బు కోసం ఆతిథ్య హక్కులను అమ్ముకోబోమని వ్యాఖ్యానించాడు. అదే సమయంలో.. తమకు అంతిమంగా దేశ ప్రయోజనాలే ముఖ్యమని నక్వీ పేర్కొన్నాడు. కాగా వచ్చే ఏడాది జరుగనున్న ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ హక్కులను పాక్ దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ మెగా ఈవెంట్‌కు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, న్యూజిలాండ్, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించగా.. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో పాకిస్తాన్ బరిలోకి దిగనుంది. పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదుఅయితే, ఆటగాళ్ల భద్రతా కారణాల దృష్ట్యా తమ ఆటగాళ్లను పాకిస్తాన్‌కు పంపే ప్రసక్తి లేదని ఇప్పటికే భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ).. అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ)కి స్పష్టం చేసింది.హైబ్రిడ్ విధానం కావాలిఈ నేపథ్యంలో టీమిండియా మ్యాచ్‌లను తటస్థ వేదికలపై నిర్వహించేలా హైబ్రిడ్ విధానం తెరమీదకు వచ్చింది. అయితే, పీసీబీ మాత్రం ఇందుకు ససేమిరా అంటోంది. మిగతా జట్లన్నీ తమ దేశానికి వస్తున్నాయని.. రోహిత్ సేన కూడా రావాల్సిందేనని పట్టుబడుతోంది. అయితే, బీసీసీఐ మాత్రం తమ ఆటగాళ్ల భద్రతను పణంగా పెట్టేందుకు సిద్ధంగా లేదు.ఈ క్రమంలో పీసీబీకి ఆర్థికంగా అదనపు ప్రయోజనాలు చేకూరేలా ఐసీసీ ఆఫర్ ఇచ్చిందనే వార్తలు వస్తున్నాయి. నవంబరు 29 నాటి సమావేశంలో ఇందుకు సంబంధించి తుదినిర్ణయం వెలువడనుందని జాతీయ మీడియా వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ గురువారం తెల్లవారుజామున మీడియాతో మాట్లాడాడు.ఐసీసీ నిర్ణయం ఏమిటో?!‘‘పాకిస్తాన్ క్రికెట్‌కు ఏది మంచో అదే చేస్తాం. ఐసీసీ చైర్మన్‌తో నేను సంప్రదింపులు జరుపుతున్నాను. ఒకవేళ టీమిండియా ఇక్కడికి రాకపోతే మేము కూడా ఇకపై భారత్‌లో ఆడబోమని కచ్చితంగా చెప్పేశాం. సమానత్వ భావన ముఖ్యం. ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సి ఉంది.అదైతే ఎప్పటికీ జరుగదుఏదేమైనా డబ్బు కోసం ఆతిథ్య హక్కులను మాత్రం అమ్ముకోమని నేను మీకు వాగ్దానం చేస్తున్నా. అదైతే ఎప్పటికీ జరుగదు. అయితే, అంతిమంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం’’ అని నక్వీ చెప్పుకొచ్చాడు. కాగా పాకిస్తాన్లో ప్రస్తుతం శాంతి భద్రతలు అదుపుతప్పిన విషయం తెలిసిందే.అదుపుతప్పిన శాంతి భద్రతలుపాకిస్తాన్కు వరల్డ్‌కప్ ట్రోఫీ అందించిన మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారుల నిరసనలతో ఇస్లామాబాద్ అట్టుడుకుతోంది. ఇమ్రాన్‌ను జైలు నుంచి విడుదల చేయాలంటూ పాకిస్తాన్ తెహ్రీక్-ఇ- ఇన్సాఫ్(పీటీఐ) పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగింది. ఫలితంగా దేశంలో శాంతి భద్రతలు అదుపుతప్పాయి. ఇలాంటి తరుణంలో పాక్‌లో మెగా టోర్నీ నిర్వహించడం సరైన నిర్ణయం కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో చాంపియన్స్ ట్రోఫీ జరిగే అవకాశం ఉంది.చదవండి: డేంజర్లో ఛాంపియన్స్ ట్రోఫీ.. పాక్ పర్యటన నుంచి వైదొలిగిన శ్రీలంక -
ఐదుగురిని సంప్రదించా.. త్వరలోనే కొత్త కోచ్ ఎంపిక: పీసీబీ చీఫ్
దక్షిణాఫ్రికా దిగ్గజం గ్యారీ కిర్‌స్టెన్ కోచ్ పదవి నుంచి తప్పుకోవడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) చీఫ్ మొహ్సిన్ నక్వీ స్పందించాడు. కిర్‌స్టెన్ నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించాడని.. ఈ క్రమంలోనే అతడితో తమ బంధం ముగిసిందని పేర్కొన్నాడు. త్వరలోనే పాక్ పరిమిత ఓవర్ల జట్టుకు కొత్త కోచ్‌ను నియమిస్తామని తెలిపాడు.అందుకే రాజీనామా!కాగా పాకిస్తాన్ వన్డే, టీ20 జట్లకు హెడ్ కోచ్‌గా ఉన్న గ్యారీ కిర్‌స్టెన్ తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. తన బాధ్యతల నుంచి తక్షణమే తప్పుకుంటున్నట్లు అతడు సోమవారం ప్రకటించాడు. రెండేళ్ల కాంట్రాక్ట్ వ్యవధితో ఈ ఏడాది ఏప్రిల్‌లో కిర్‌స్టెన్‌ను ప్రధాన కోచ్‌గా పీసీబీ నియమించింది. కానీ.. కనీసం ఆరు నెలలు కూడా అతడు కోచ్‌గా పని చేయలేదు. ఆస్ట్రేలియా పర్యటనకు పాక్ వెళ్లనున్న నేపథ్యంలో కిర్‌స్టెన్ తన పదవి నుంచి తప్పుకోవడం గమనార్హం. అయితే, జట్టు ఎంపిక విషయంలో తనకు ఉన్న అధికారాలను తప్పించడం పట్ల కలత చెందిన కిర్‌స్టెన్ రాజీనామా చేసినట్లు సమాచారం. పరిమిత ఓవర్ల జట్లకు కెప్టెన్లను ఎంపిక చేసే విషయంలో తన సూచనలను కనీసం పరిగణనలోకి తీసుకోకపోగా... తాను దేశంలోనే లేని సమయంలో జట్టును ప్రకటించడంపై పీసీబీ అధికారులతో కిర్‌స్టెన్ వాదనకు దిగినట్లు తెలిసింది.కాగా ఇటీవల సొంతగడ్డపై ఇంగ్లండ్ చేతిలో పాకిస్తాన్ తొలి టెస్టులో చిత్తయిన తర్వాత పీసీబీ కొత్త సెలక్షన్ కమిటీని నియమించిన విషయం విదితమే. ఈ విషయంలోనూ జోక్యం చేసుకోవద్దని కిర్‌స్టెన్‌కు పీసీబీ సూచించడం గమనార్హం. ఇక కిర్‌స్టెన్‌తో టెస్టు టీమ్ హెడ్ కోచ్‌గా ఉన్న జాసన్ గిలెస్పీ కూడా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నా... ఇంగ్లండ్‌తో తర్వాతి రెండు టెస్టుల్లో ఘన విజయం సాధించి పాక్ సిరీస్ గెలుచుకోవడంతో ఈ అంశం కాస్త వెనక్కి వెళ్లింది. ఒక్క వన్డే ఆడకుండా... ఇదిలా ఉంటే.. కిర్‌స్టెన్ కోచ్‌గా బాధ్యతలు తీసుకున్న తర్వాత పాకిస్తాన్ టీ20 ప్రపంచ కప్‌లో బరిలోకి దిగింది. గ్రూప్ దశలో భారత్, అమెరికా చేతుల్లో పరాజయంతో సూపర్–8 దశకు కూడా చేరకుండానే టోర్నీ నుంచి నిష్క్రమించింది. అయితే, 28 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత టీమిండియాను వన్డే వరల్డ్ చాంపియన్‌గా నిలిపిన రికార్డు ఉన్న కిర్‌స్టెన్‌ను ఎంపిక చేసినప్పుడు ప్రధానంగా తమ వన్డే టీమ్‌ను తీర్చిదిద్దే విషయంపైనే బాధ్యతలు అప్పగించారు.అంతేకాదు.. 2025లో పాకిస్తాన్ వేదికగా జరిగే చాంపియన్స్ ట్రోఫీలో తమ టీమ్‌ను విజేతగా నిలపాలని...అందు కోసం ఆయన ఆలోచనల ప్రకారం జట్టును మలిచే అధికారాన్ని పీసీబీ ఇచ్చింది. అయితే ఈ ఆరు నెలల వ్యవధిలో పాక్ ఒక్క వన్డే కూడా ఆడకపోవడం విశేషం!గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలుమరోవైపు ప్రస్తుతం టెస్టు కోచ్‌గా ఉన్న ఆసీస్ మాజీ పేస్ బౌలర్ గిలెస్పీకి వన్డే, టీ20 కోచ్‌గా తాత్కాలిక బాధ్యతలు అప్పగించినట్లు పీసీబీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో పీసీబీ చీఫ్ మొహ్సిన్ నక్వీ మాట్లాడుతూ.. ‘‘కిర్‌స్టెన్ పీసీబీతో ఒప్పందాన్ని రద్దు చేసుకున్నాడు. అంతేకాదు.. బోర్డు నిబంధనల్లో కొన్నిటిని ఉల్లంఘించాడు. మాతో కాంట్రాక్టును అతడే ముగించుకున్నాడు’’ అని తెలిపాడు.ఐదుగురిని సంప్రదించాఇక జింబాబ్వే పర్యటన సందర్భంగా తమ వన్డే, టీ20 జట్లకు కొత్త కోచ్ వస్తాడని నక్వీ ఈ సందర్భంగా వెల్లడించాడు. ఆస్ట్రేలియా గడ్డపై పాక్ ఆడే మూడు వన్డేలు, మూడు టీ20 వరకు మాత్రమే తాను కోచ్‌గా పని చేస్తానని గిల్లెస్పీ చెప్పాడని పేర్కొన్నాడు. అతడికి పూర్తి స్థాయిలో బాధ్యతలు తీసుకునే ఉద్దేశం లేదని తెలిపిన నక్వీ.. కొత్త కోచ్ అన్వేషణలో భాగంగా ఇప్పటికే తాను ఐదుగురిని సంప్రదించానని పేర్కొన్నాడు. చదవండి: IPL 2025: అత్యంత ఖరీదైన ఆటగాడు అతడే.. పది జట్ల రిటెన్షన్ లిస్టు ఇదే! -
టీమిండియా పాకిస్తాన్‌కు రావాల్సిందే: పీసీబీ చీఫ్
చాంపియన్స్ ట్రోఫీ-2025కి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్తాన్ టీమిండియాను తమ దేశానికి రప్పించాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయం గురించి అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) వద్ద తమ వాదనను వినిపించిన పాక్ బోర్డు.. భారత జట్టు కోసం వేదికను తరలించవద్దని విజ్ఞప్తి చేసింది.వేదిక మార్చబోమన్న ఐసీసీ ఇందుకు తాము సానుకూలంగా ఉన్నట్లు ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ జాఫ్రీ అలార్డిస్ ఇటీవల సంకేతాలు ఇచ్చాడు. పాకిస్తాన్ క్రికెట్ బోర్డే(పీసీబీ) ఈ మెగా టోర్నీని నిర్వహిస్తుందని.. వేదికను మార్చే ఉద్దేశం తమకు లేదని స్పష్టం చేశాడు. అయితే, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇందుకు సుముఖంగా లేదని వార్తలు వినిపిస్తున్నాయి.కేంద్రం అనుమతినిస్తేనేఆటగాళ్ల భద్రత దృష్ట్యా పాకిస్తాన్ పర్యటనకు పంపకూడదని భావిస్తున్నట్లు సమాచారం. ఈ విషయం గురించి బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా మాట్లాడుతూ.. టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్తుందా? లేదా అనేది భారత ప్రభుత్వ నిర్ణయంపైనే ఆధారపడి ఉందని స్పష్టం చేశాడు. కేంద్రం అనుమతినిస్తేనే తమ జట్టు ఏ టూర్‌కైనా వెళ్లుందని.. పాకిస్తాన్ కూడా ఇందుకు మినహాయింపుకాదని పేర్కొన్నాడు.జైశంకర్‌తో భేటీ కానున్న పీసీబీ చీఫ్?ఈ నేపథ్యంలో పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీ కీలక ముందడుగు వేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్‌తో నక్వీ భేటీ కానున్నట్లు పాక్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. కాగా షాంఘై కో ఆపరేషన్ ఆర్గనైజేషన్(SCO) సమావేశంలో పాల్గొనేందుకు జైశంకర్ పాకిస్తాన్‌కు వెళ్లనున్న విషయం తెలిసిందే.ఇస్లామాబాద్‌లో అక్టోబరు 15-16 తేదీల్లో ఈ సమ్మిట్ నిర్వహించేందుకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నేపథ్యంలో నక్వీ జైశంకర్‌ను కలిసి.. టీమిండియా పాక్ పర్యటన గురించి మాట్లాడాలనే యోచనలో ఉన్నట్లు సమాచారం. అంతేకాదు.. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో నిర్వహించనున్న ఈ ఐసీసీ టోర్నీ వీక్షించేందుకు ఆయనను ఆహ్వానించనున్నట్లు తెలుస్తోంది.అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందేఇందుకు సంబంధించిన ప్రొటోకాల్స్, భద్రతా అంశాల గురించి మొహ్సిన్ నక్వీ.. జైశంకర్‌కు వివరించనున్నట్లు క్రికెట్ పాకిస్తాన్ నివేదిక పేర్కొంది. ఈ నేపథ్యంలో నక్వీ తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. ‘‘టీమిండియా ఇక్కడకు వస్తుందనే అనుకుంటున్నాం. పర్యటనను రద్దు చేసుకోవడానికి గానీ.. వాయిదా వేయడానికి గానీ కారణాలు లేవు. అన్ని జట్లు ఇక్కడకు రావాల్సిందే’’ అని పేర్కొన్నాడు. కాగా 2008 ఆసియా కప్ తర్వాత ఇంత వరకు భారత జట్టు ఒక్కసారి కూడా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా బీసీసీఐ కూడా పాక్‌తో ఎలాంటి ద్వైపాక్షిక సిరీస్‌లలోనూ పాల్గొనడం లేదు. అయితే, గతేడాది ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. టీమిండియా అక్కడకు వెళ్లలేదు. ఎవరి మాట నెగ్గుతుందో?దీంతో రోహిత్ సేన ఆడిన మ్యాచ్‌లకు తటస్థ వేదికగా శ్రీలంకను ఉపయోగించుకున్నారు. ఇక చాంపియన్స్ ట్రోఫీ విషయంలోనూ ఇదే తరహా హైబ్రిడ్ విధానాన్ని అనుసరించాలని బీసీసీఐ ఐసీసీని కోరినట్లు సమాచారం. కానీ పీసీబీ మాత్రం తమ దేశంలో ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ వంటి జట్టు పర్యటించాయని.. ఆటగాళ్ల భద్రత విషయంలో ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో ఎవరి మాట నెగ్గుతుందో చూడాలి! కాగా చాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్య పాకిస్తాన్‌తో పాటు టీమిండియా, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, అఫ్గనిస్తాన్, ఇంగ్లండ్, న్యూజిలాండ్, బంగ్లాదేశ్ అర్హత సాధించాయి.చదవండి: నేను అలా బౌలింగ్ చేయడానికి కారణం వారే: మయాంక్ యాదవ్ -
జై షా స్థానాన్ని భర్తీ చేయనున్న పీసీబీ చీఫ్?
భారత క్రికెట్ నియంత్రణ మండలి కార్యదర్శి జై షా త్వరలోనే అంతర్జాతీయ క్రికెట్ మండలి చైర్మన్ పదవి చేపట్టనున్నారు. ఈ ఏడాది డిసెంబరు 1న ఐసీసీ బాస్‌గా బాధ్యతలు తీసుకోనున్నారు. ఇందుకు సంబంధించిన ఎన్నిక ప్రక్రియ ఇప్పటికే పూర్తైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జై షా త్వరలోనే బీసీసీఐ కార్యదర్శి పదవి నుంచి తప్పుకోనున్నారు.అదే విధంగా.. ఆసియా క్రికెట్ మండలి(ఏసీసీ) అధ్యక్షుడిగానూ రాజీనామా చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఏసీసీ కొత్త ప్రెసిడెంట్ ఎవరన్న చర్చ జరుగుతుండగా.. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నక్వీ పేరు తెరమీదకు వచ్చింది. జై షా స్థానాన్ని నక్వీ భర్తీ చేయనున్నాడని.. త్వరలోనే ఇందుకు సంబంధించిన ప్రకటన వెలువడనున్నట్లు తెలుస్తోంది.కొత్త బాస్‌గా నక్వీ?‘‘వచ్చే ఏడాది ఆరంభంలో జరుగనున్న ఏసీసీ సమావేశంలో.. కొత్త అధ్యక్షుడిగా మొహ్సిన్ నక్వీ ఎంపిక కానున్నారు. రెండేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు’’ అని ఏసీసీ వర్గాలు వెల్లడించినట్లు వార్తా సంస్థ పీటీఐ తెలిపింది. కాగా ఆసియా వన్డే కప్-2023 ఆతిథ్య హక్కులను పాకిస్తాన్ దక్కించుకోగా.. భద్రతా కారణాల దృష్ట్యా టీమిండియా అక్కడికి వెళ్లలేదన్న సంగతి తెలిసిందే.అయితే, పాక్ బోర్డు మాత్రం భారత జట్టు తమదేశానికి రావాల్సిందేనని పట్టుపట్టగా.. జై షా నేతృత్వంలోని ఏసీసీ హైబ్రిడ్ విధానంలో మ్యాచ్‌లు నిర్వహించాలని నిర్ణయించింది. దీంతో పాక్‌తో పాటు శ్రీలంకను ఆతిథ్య దేశంగా ఎంపిక చేసి.. టీమిండియా మ్యాచ్‌లను అక్కడ నిర్వహించింది. భారత్‌తో పాటు లంక ఫైనల్‌కు చేరగా.. టైటిల్ పోరు కూడా శ్రీలంకలోనే జరిగింది. అయితే, జై షా స్థానంలో నక్వీ వస్తే.. భవిష్యత్‌లో ఇలాంటి పరిస్థితి తలెత్తితే.. ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో అనే ఆసక్తి నెలకొంది.ఐసీసీ టోర్నీలకు సన్నాహకాలుగాఇదిలా ఉంటే.. వచ్చే ఏడాది భారత్‌లో పురుషుల ఆసియాకప్ జరుగనుంది. టీ20 ఫార్మాట్లో జరిగే ఈ టోర్నీని2025 సెప్టెంబర్‌లో నిర్వహించనున్నారు. స్వదేశంలో జరుగనున్న టీ20 ప్రపంచకప్-2026కు ముందుగా ఈ టోర్నీని నిర్వహించడం వల్ల.. ఆసియా దేశాలకు కావాల్సినంత ప్రాక్టీస్ లభించనుంది. అనంతరం.. ఆసియా కప్-2027నకు బంగ్లాదేశ్ ఆతిథ్యమిస్తుంది. అదే ఏడాది దక్షిణాఫ్రికాలో వన్డే ప్రపంచకప్ ఉండటంతో బంగ్లాలో వన్డే ఫార్మాట్లో ఆసియాకప్ నిర్వహించాలని ఏసీసీ నిర్ణయించింది. -
పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు: పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ ఫైర్
బంగ్లాదేశ్ చేతిలో ఓటమి నేపథ్యంలో పాకిస్తాన్ జట్టుపై విమర్శలు కొనసాగుతున్నాయి. టెస్టుల్లో తొలిసారి పాక్ బంగ్లాతో మ్యాచ్‌లో పరాజయం పాలైన విషయం తెలిసిందే. అది కూడా సొంతగడ్డపై ఏకంగా పది వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. ఫలితంగా ఆ దేశ మాజీ క్రికెటర్ల నుంచి షాన్ మసూద్ బృందం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది.మాజీ కెప్టెన్, మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కూడా తాజాగా ఈ జాబితాలో చేరాడు. అయితే, ఈ ఘోర పరాభవానికి పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరిస్తున్న విధానాలే కారణమంటూ చైర్మన్ మొహ్సిన్ నక్వీపై సంచలన ఆరోపణలు చేశాడు. అవినీతిలో కూరుకుపోయిన నక్వీ నేతృత్వంలోని బోర్డు పాక్ క్రికెట్‌ను భ్రష్టు పట్టిస్తోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.పాక్ క్రికెట్‌ను నాశనం చేశారు‘‘దేశ ప్రజలు టీవీలో ఆసక్తిగా చూసే ఏకైక క్రీడ క్రికెట్. కానీ ఇప్పుడు దానిని కూడా నాశనం చేస్తున్నారు. సమర్థత లేని, తమకు ప్రియమైన అధికారులను నియమించుకోవడం వల్లే పాక్ బోర్డుకు ఈ గతి పట్టింది. వాళ్ల హయాంలో తొలిసారి మన జట్టు వన్డే వరల్డ్‌కప్ టాప్-4కు చేరలేకపోయింది.టీ20 ప్రపంచకప్-2024 టాప్-8లోనూ నిలవలేకపోయింది. ఇప్పుడు ఏకంగా కనీవినీ ఎరుగని రీతిలో బంగ్లాదేశ్ చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడి పూర్తిగా దిగజారిపోయింది. రెండున్నరేళ్ల క్రితం ఇదే జట్టు టీమిండియాను ఓడించింది కదా! మరి ఈ స్వల్ప కాలంలో అంతగా ఏం జరిగిందని.. ఇంతటి ఘోర పరాభవాలు. ఇందుకు ఎవరిని బాధ్యులను చేయాలి? దీనంతటికీ ఒకే వ్యవస్థ కారణం’’ అంటూ ఇమ్రాన్ ఖాన్ పాక్ బోర్డుపై నిప్పులు చెరిగాడు.పీసీబీ చీఫ్‌పై ఇమ్రాన్ ఖాన్ సంచలన ఆరోపణలుఅదే విధంగా.. నక్వీ దుబాయ్‌లో తన భార్య పేరు మీద ఐదు మిలియన్ డాలర్ల మేర ఆస్తులు కూడబెట్టాడని.. 2008లో అవినీతి ఆరోపణలపై విచారణ కూడా ఎదుర్కొన్నాడని ఇమ్రాన్ ఖాన్ ఈ సందర్భంగా పేర్కొన్నాడు. కాగా పాకిస్తాన్‌కు ప్రపంచకప్ అందించిన ఇమ్రాన్ ఖాన్ తర్వాత రాజకీయాల్లో ప్రవేశించాడు. పాకిస్తాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) అనే పార్టీని స్థాపించిన ఇమ్రాన్ ఖాన్.. ఎన్నికల్లో గెలిచి ప్రధాని అయ్యాడు. అయితే, అవినీతి ఆరోపణలపై అరెస్టైన ఈ మాజీ క్రికెటర్‌పై ఇతరత్రా కేసులు కూడా నమోదయ్యాయి. ప్రస్తుతం అతడు రావల్పిండి సెంట్రల్ జైలులోనే ఉన్నాడు. అక్కడి నుంచే సోషల్ మీడియా వేదికగా ఈమేరకు సందేశం పంపించాడు.పాకిస్తాన్ వర్సెస్ బంగ్లాదేశ్ తొలి టెస్టు(ఆగష్టు 21- 25)వేదిక: రావల్పిండిటాస్: బంగ్లాదేశ్.. తొలుత బౌలింగ్పాక్ తొలి ఇన్నింగ్స్ స్కోరు: 448/6 డిక్లేర్డ్బంగ్లా తొలి ఇన్నింగ్స్ స్కోరు: 565పాక్ రెండో ఇన్నింగ్స్ స్కోరు: 146 ఆలౌట్బంగ్లా రెండో ఇన్నింగ్స్ స్కోరు: 30/0ఫలితం: పాకిస్తాన్‌ను 10 వికెట్ల తేడాతో మట్టికరిపించిన బంగ్లాదేశ్ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: ముష్ఫికర్ రహీం(191 పరుగులు).చదవండి: రిజ్వాన్ ముఖంపైకి బంతి విసిరిన షకీబ్.. ఐసీసీ చర్యలు -
పాక్ స్టేడియాల్లో కనీస వసతులు లేవు.. ఒక్కటీ..: పీసీబీ చీఫ్
పాకిస్తాన్ స్టేడియాలు అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేవని ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ అన్నారు. చాలా స్టేడియాల్లో కనీస వసతులు కూడా లేవని పెదవి విరిచారు. చాంపియన్స్ ట్రోఫీ నాటికి ఈ దుస్థితిని మార్చే దిశగా ప్రక్షాళన చర్యలు చేపట్టామని తెలిపారు.వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న ఈ ఐసీసీ టోర్నీ నిర్వహణ హక్కులను పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టేడియాలను పునరుద్దరించాల్సిన ఆవశ్యకతను గుర్తించిన పీసీబీ పనులు మొదలుపెట్టింది. ఈ క్రమంలో లాహోర్‌లో గల ప్రసిద్ధ గడాఫీ స్టేడియాన్ని పీసీబీ చీఫ్ మొహ్సిన్ నఖ్వీ సందర్శించారు.మన స్టేడియాలు బాలేవుఈ సందర్భంగా నఖ్వీ విలేకరులతో మాట్లాడుతూ.. ‘‘మన స్టేడియాలకు.. అంతర్జాతీయ స్టేడియాలకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంది. మన స్టేడియాల్లో ఒక్కటీ అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా లేదు. ఆ పరిస్థితిని మార్చేందుకు మేము ప్రక్షాళన చర్యలు చేపట్టాం. ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్ రాత్రిపగలూ తేడా లేకుండా ఎంతో కష్టపడుతోంది.ప్రథమ ప్రాధా న్యం అదేప్రపంచంలోని అత్యుత్తమ స్టేడియాలలో ఒకటిగా మన స్టేడియాలను తీర్చిదిద్దుతాం. అయితే, అంతకంటే ముందు పూర్తిస్థాయిలో మౌలిక వసతులు కల్పించడమే మొదటి ప్రాధాన్యంగా పనిచేస్తున్నాం’’ అని పేర్కొన్నారు. కాగా చాంపియన్స్ ట్రోఫీ-2025 నేపథ్యంలో క్రికెట్ స్టేడియాల పునరుద్ధరణలో భాగంగా పీసీబీ ఇప్పటికే 17 బిలియన్ల పాక్ రూపాయలను కేటాయించినట్లు సమాచారం.ఇక ఈ మెగా టోర్నీ నిర్వహణ కోసం ఐసీసీ పీసీబీకి 70 మిలియన్ అమెరికన్ డాలర్ల నిధుల విడుదలకు ఆమోదం తెలిపింది. అయితే, ఈ ఈవెంట్లో పాల్గొనేందుకు టీమిండియా పాక్‌కు వెళ్లబోదని బీసీసీఐ పెద్దలు చెబుతుండగా.. హైబ్రిడ్ విధానానికి తాము ఒప్పుకోమని పీసీబీ అంటోంది. ఈ విషయంపై ఐసీసీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి!!చదవండి: చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ వేదిక అదే: పీసీబీ చీఫ్