Photo: IPL Twitter
ఐపీఎల్ 16వ సీజన్‌లో గురువారం రాజస్తాన్ రాయల్స్, సీఎస్‌కే తలపడుతున్న సంగతి తెలిసిందే. సొంత గ్రౌండ్‌లో రాజస్తాన్ ఆడుతున్నప్పటికి సీఎస్‌కేనే ఫెవరెట్‌గా కనిపిస్తోంది. ఎందుకంటే సీజన్‌లో సీఎస్‌కే వరుస విజయాలతో టాప్ ప్లేస్‌లో ఉంది. మరోవైపు రాజస్తాన్ మాత్రం రెండు వరుస పరాజయాలతో డీలా పడింది.
ఇదే జైపూర్‌లో 2019 ఐపీఎల్ సీజన్‌లో రాజస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్ ఎంఎస్ ధోని ఉగ్రరూపం ప్రదర్శించాడు. ఎందుకంటే ఎప్పుడు శాంతంగా.. కూల్‌గా కనిపించే ధోని ఇలా సహనం కోల్పోయి అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో ఆసక్తి రేపింది. తాజాగా మరోసారి నాలుగేళ్ల తర్వాత సీఎస్‌కే, రాజస్తాన్‌లు జైపూర్‌లో మ్యాచ్ ఆడుతుండడంతో ధోనికి కోపం తెప్పించిన ఘటనను ఒకసారి గుర్తు చేసుకుందాం.
Photo: IPL Twitter
అంపైర్ల చర్య ధోనికి ఆగ్రహం తెప్పించిన వేళ..
మ్యాచ్‌లో సీఎస్‌కే టార్గెట్ దిశగా పయనించింది. అయితే ఆఖరి ఓవర్లో కాస్త హైడ్రామా నెలకొంది. చివరి ఓవర్ అప్పటి రాజస్థాన్ బౌలర్ బెన్ స్టోక్స్ వేశాడు. ఓవర్ నాలుగో బంతిని స్టోక్స్ ఫుల్‌టాస్ వేయగా క్రీజులో ఉన్న మిచెల్ సాంట్నర్ లాంగాన్ దిశగా ఆడి రెండు పరుగులు తీశాడు.
అయితే బంతి నడుము పైభాగంలో వెళ్లడంతో ఫీల్డ్ అంపైర్ నోబాల్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ స్క్వేర్‌లెగ్ అంపైర్ మాత్రం నోబాల్ కాదని పేర్కొన్నాడు. దీంతో బంతిని కౌంట్ చేశారు. ఇది సీఎస్‌కే కెప్టెన్ ధోనిని ఆశ్చర్యపరిచింది. కోపంతో వేగంగా గ్రౌండ్‌లోకి దూసుకొచ్చిన ధోని ఫీల్డ్‌లోనే అంపైర్లతో వాదనకు దిగాడు. ఆ తర్వాత రాజస్తాన్ ఆటగాళ్లు కూడా అక్కడికి వచ్చారు. ఒకేసారి ఇద్దరు అంపైర్లు వేర్వేరు నిర్ణయాలు ఎలా చెబుతారంటూ ధోని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
Photo: IPL Twitter
అయితే చివరికి లెగ్ అంపైర్ మాత్రం తన నిర్ణయానికే కట్టుబడడంతో ధోని కోపంగా డగౌట్‌కు వెళ్లిపోయాడు. ఈ చర్య మైదానంలో ఉన్న ప్రేక్షకులతో పాటు టీవీ చూస్తున్న అభిమానులను కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ధోని చర్యను తప్పుబట్టిన రిఫరీ 50 శాతం జరిమానా విధించడంతో పాటు హెచ్చరిక జారీ చేశారు. మ్యాచ్‌లో సీఎస్‌కే విజయం సాధించినప్పటికి ధోని మాత్రం తన ప్రవర్తనతో విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది.
Angry MSD 🔥
— Hemil Jodhani (@HemilJodhani) April 12, 2023
CSK vs RR always remind me of this moment. Rarest scene ever in Ms Dhoni's career. #CSKvsRR pic.twitter.com/N5fc3V6e4n
Comments
Please login to add a commentAdd a comment