IPL 2022 CSK Vs SRH: MS Dhoni Loses Cool After Mukesh Choudhary Bowls A Wide, Goes Viral - Sakshi
Sakshi News home page

IPL 2022: మైండ్ ఎక్కడ పెట్టి బౌలింగ్ చేస్తున్నావ్‌.. ముఖేష్‌పై కోపంతో ఊగిపోయిన ధోని

Published Mon, May 2 2022 1:02 PM | Last Updated on Mon, May 2 2022 3:07 PM

MS Dhoni loses cool after Mukesh Choudhary bowls a wide in final over - Sakshi

సహనం కోల్పోయిన ధోని (Photo Courtesy: IPL)

ఐపీఎల్‌-2022లో భాగంగా ఆదివారం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే కెప్టెన్‌ ఎంస్‌ ధోని తన ప్రశాంతతను కోల్పోయాడు. మ్యాచ్‌ అఖరి ఓవర్‌లో ముఖేష్ చౌదరిపై ధోని కోపంతో ఊగిపోయాడు. అఖరి ఓవర్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌ విజయానికి 37 పరుగులు కావల్సిన నేపథ్యంలో ధోని ముఖేష్‌ చేతికి బంతికి అందించాడు. ముఖేష్‌ వేసిన అఖరి ఓవర్‌ తొలి రెండు బంతులకు  సిక్స్‌, ఫోర్‌ పూరన్‌ బాదాడు.

ఈ క్రమంలో వెంటనే ధోని ఫీల్డ్‌లో మార్పులు చేశాడు. పూరన్‌కు ఆఫ్‌సైడ్‌లో ధోని ఫీల్డ్‌  సెట్ చేశాడు. అయితే ముఖేష్‌ ఫీల్డ్‌కు భిన్నంగా లెగ్ సైడ్ బంతిని వేశాడు. అయితే వెంటనే అంపైర్‌ దాన్ని వైడ్‌గా ప్రకటించాడు. దీంతో అసహానికి గురైన ధోని.. ఆఫ్‌సైడ్‌లో ఫీల్డర్‌లను చూపిస్తూ కొంచెం ఆలోచించి బౌలింగ్‌ చేయు అని ముఖేష్‌కు సైగలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇక ఈ మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్‌పై 13 పరుగుల తేడాతో సీఎస్‌కే విజయం సాధించింది.

చదవండి: IPL 2022: 'సెంచరీలు కాదు జట్టు గెలవడం ముఖ్యం.. చాలా సంతోషంగా ఉన్నా'

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement