Photo Courtesy: IPL
ముంబైని గెలిపించిన హార్ధిక్.. హ్యాట్రిక్ ఓటములకు బ్రేక్
ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో ముంబై ఇండియన్స్ హ్యట్రిక్ పరాజయాలకు చెక్ పెట్టింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో విజయాన్ని అందుకుంది. 136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్ 19 ఓవర్లలో చేధించింది. హార్దిక్ పాండ్యా తొలిసారి బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. 30 బంతుల్లో 40 పరుగులు చేసిన పాండ్యా ఇన్నింగ్స్‌లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. పొలార్డ్ 15పరుగులతో హార్ధిక్‌కు సహకరించాడు. అంతకముందు సౌరబ్ తివారి 45 పరుగులతో కీలక ఇన్నింగ్స్ ఆడాడు. పంజాబ్ బౌలర్లలో రవి బిష్ణోయి 2, షమీ, నాథన్ ఎలిస్ చెరో వికెట్ తీశారు.
అంతకముందు తొలుత బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల నిలకడైన బౌలింగ్‌కు పంజాబ్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఎయిడెన్ మక్రమ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్, రాహుల్ చహర్ తలా ఒక వికెట్ తీశారు.
సౌరవ్ తివారి ఔట్.. ముంబై నాలుగో వికెట్ డౌన్
నిలకడగా ఆడుతున్న సౌరవ్ తివారి(45) అనవసర షాట్‌కు యత్నించి నాథన్ ఎలిస్ బౌలింగ్‌లో కేఎల్ రాహుల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో ముంబై ఇండియన్స్ 92 పరుగుల వద్ద నాలుగో వికెట్ కోల్పోయింది. హార్ధిక్ పాండ్యా 11 పరుగులతో క్రీజులో ఉన్నాడు. ముంబై విజయానికి 29 బంతుల్లో 44 పరుగులు చేయాల్సి ఉంది.
9 ఓవర్లలో ముంబై ఇండియన్స్ 60/2
రోహిత్ శర్మ, సూర్యకుమార్‌లు ఔటైన తర్వాత ముంబై ఇండియన్స్ నిలకడగా ఆడుతోంది. ఓపెనర్ డికాక్, సౌరబ్ తివారిలు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతున్నారు. ప్రస్తుతం ముంబై 9 ఓవర్ల తర్వాత 2 వికెట్ల నష్టానికి 54 పరుగులు చేసింది. డికాక్ 22, తివారి 23 పరుగులతో క్రీజులో ఉన్నారు.
Photo Courtesy: IPL
సూర్య గోల్డెన్ డక్.. రెండో వికెట్ కోల్పోయిన ముంబై
136 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబై ఇండియన్స్‌ను రవిబిష్ణోయి వరుస బంతుల్లో దెబ్బతీశాడు. ఇన్నింగ్స్ 4వ ఓవర్‌లో మూడో బంతికి రోహిత్ శర్మ(8)ను వెనక్కిపంపిన బిష్ణోయి.. తర్వాతి బంతికే సూర్యకుమార్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో సూర్యకుమార్ గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. ప్రస్తుతం ముంబై 4 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 18 పరుగులు చేసింది.
ముంబై ఇండియన్స్ టార్గెట్ 136
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. ముంబై బౌలర్ల నిలకడైన బౌలింగ్‌కు పంజాబ్ పెద్ద స్కోరు చేయలేకపోయింది. ఎయిడెన్ మక్రమ్ 42 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా.. దీపక్ హుడా 28 పరుగులు చేశాడు. ముంబై బౌలర్లలో బుమ్రా, పొలార్డ్ చెరో రెండు వికెట్లు తీయగా.. కృనాల్, రాహుల్ చహర్ తలా ఒక వికెట్ తీశారు.
Photo Courtesy: IPL
ఐదో వికెట్ కోల్పోయిన పంజాబ్.. మార్క్రమ్(42) ఔట్
16వ ఓవర్ తొలి బంతికి బౌండరీ బాది జోరు మీదున్న మార్క్రమ్(29 బంతుల్లో 42; 6 ఫోర్లు)ను రాహుల్ చాహర్ క్లీన్ బౌల్డ్ చేశాడు. 15.2 ఓవర్ల తర్వాత పంజాబ్ స్కోర్ 109/5. క్రీజ్‌లో దీపక్ హూడా(25), హర్ప్రీత్ బ్రార్ ఉన్నారు.
11 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ స్కోరు 69/4
11 ఓవర్లు ముగిసేసరికి పంజాబ్ కింగ్స్ 4 వికెట్ల నష్టానికి 69 పరుగులు చేసింది. నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ పంజబ్‌ను దీపక్ హుడా, మక్రమ్‌లు చక్కదిద్దే పనిలో పడ్డారు. మక్రమ్ 18, హుడా 9 పరుగులతో ఆడుతున్నారు.
పంజాబ్ 50 పరుగుల స్కోరు వద్ద పూరన్(2) రూపంలో నాలుగో వికెట్ కోల్పోయింది. బుమ్రా వేసిన క్లీన్ యార్కర్‌కు పూరన్ ఎల్బీగా వెనుదిరిగాడు. ప్రస్తుతం 9 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 57 పరుగులు చేసింది. మక్రమ్ 12, దీపక్ హుడా 3 పరుగులతో ఆడుతున్నారు.
Photo Courtesy: IPL
కేఎల్ రాహుల్ ఔట్.. 41 పరుగులకే మూడు వికెట్లు
పంజాబ్ కింగ్స్ వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతుంది. పొలార్డ్ వేసిన 7వ ఓవర్‌లో పంజాబ్ కింగ్స్ వరుసగా రెండు వికెట్లు కోల్పోయింది. 21 పరుగులు చేసిన కేఎల్ రాహుల్ బుమ్రాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.ప్రస్తుతం పంజాబ్ స్కోరు 7 ఓవర్లలో 46/3గా ఉంది. అంతకముందు యునివర్సల్ బాస్ క్రిస్ గేల్ మరోసారి నిరాశపరిచాడు. ఒక్క పరుగు మాత్రమే చేసిన గేల్ పొలార్డ్ బౌలింగ్‌లో హార్దిక్ పాండ్యాకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 39 పరుగుల వద్ద రెండో వికెట్ కోల్పోయింది.
Photo Courtesy: IPL
తొలి వికెట్ కోల్పోయిన పంజాబ్.. 36/1
మన్‌దీప్ సింగ్(15) రూపంలో పంజాబ్ కింగ్స్ తొలి వికెట్ కోల్పోయింది. కృనాల్ పాండ్యా బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు. దీంతో పంజాబ్ 36 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది. రాహుల్ 19 పరుగులతో క్రీజులో ఉన్నాడు.
Photo Courtesy: IPL
4 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 32/0
ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ ఇన్నింగ్స్‌ను నిలకడగా ఆరంభించింది. 4 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 32 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 16, మన్‌దీప్ సింగ్ 14 పరుగులతో క్రీజులో ఉన్నారు.
అబుదాబి: ఐపీఎల్ 2021 సెకండ్‌ఫేజ్‌లో భాగంగా నేడు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరగనుంది. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ బౌలింగ్ ఎంచుకుంది. వరుస పరాజయాలతో డీలా పడిన ముంబై ఇండియన్స్ కనీసం ఈ మ్యాచ్‌తోనైనా గెలుపుబాట పట్టనుందా అనేది ఆసక్తికరంగా మారింది. మరోవైపు పంజాబ్ కింగ్స్ ఆటతీరు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన గత మ్యాచ్‌లో విజయం సాధించిన పంజాబ్ కింగ్స్ అదే ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది.
ఇప్పటికే ఇరు జట్లు 10 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. పాయింట్ల పట్టికలో పంజాబ్ కింగ్స్ 8 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా.. నెట్‌రన్‌రేట్ దారుణంగా ఉండడంతో ముంబై ఇండియన్స్ 8 పాయింట్లతో ఏడో స్థానంలో కొనసాగుతుంది. రెండు జట్లలోనూ ఓపెనర్లు మినహా మిగతా బ్యాటర్స్ ఎవరు ఫామ్‌లో లేకపోవడం ఆందోళన కలిగిస్తుంది. ఇక తొలి అంచె పోటీల్లో ఇరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్‌నే విజయం వరించింది. ఆ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 131 పరుగులు చేసింది. ఆ తర్వాత పంజాబ్ కేఎల్ రాహుల్ జోరు చూపడం.. వన్‌డౌన్‌లో గేల్ మెరుపులతో 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ముఖాముఖి పోరులో ఇరు జట్లు 27 సార్లు తలపడగా.. 14 సార్లు ముంబై విజయాలు అందుకోగా.. 13 సార్లు పంజాబ్‌ను విజయం వరించింది.
ముంబై ఇండియన్స్: రోహిత్ శర్మ (కెప్టెన్), క్వింటన్ డి కాక్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, సౌరభ్ తివారీ, కృనాల్ పాండ్యా, హార్దిక్ పాండ్యా, కిరాన్ పొలార్డ్, నాథన్ కౌల్టర్-నైల్, రాహుల్ చాహర్, జస్ప్రిత్ బుమ్రా, ట్రెంట్ బౌల్ట్
పంజాబ్ కింగ్స్: కేఎల్ రాహుల్(కెప్టెన్), మన్దీప్ సింగ్, క్రిస్ గేల్, ఐడెన్ మార్క్రామ్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, హర్‌ప్రీత్ బ్రార్, నాథన్ ఎల్లిస్, మహమ్మద్ షమీ, రవి బిష్ణోయ్, అర్ష్‌దీప్ సింగ్
Comments
Please login to add a commentAdd a comment