![Naseem Shah is better than Bumrah: Ihsanullah](/styles/webp/s3/article_images/2024/10/20/nasemm.jpg.webp?itok=-djqmVvL)
జస్ప్రీత్ బుమ్రా.. ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లలో అగ్రస్ధానంలో కొనసాగుతున్నాడు. మూడు ఫార్మాట్లలో బుమ్రాను మించినవారు లేరనడంలో అతిశయోక్తే లేదు. యార్కర్లతో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తించే సత్తా అతడిది. అటువంటి వరల్డ్‌క్లాస్ ప్రీమియర్ ఫాస్ట్ బౌలర్‌పై పాకిస్తాన్ పేసర్ ఇహ్సానుల్లా తన అక్కసును వెళ్లగక్కాడు.
జస్ప్రీత్ బుమ్రా కంటే పాక్ పేసర్ నసీమ్ షా అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్ అని ఇహ్సానుల్లా అభిప్రాయపడ్డాడు. కాగా నసీం షా మంచి ఫాస్ట్ బౌలర్ అనడంలో ఎటువంటి సందేహం లేదు. అతడు ఇప్పటికే తన పేస్, స్వింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో తనదైన ముద్ర వేసుకున్నాడు. కానీ బుమ్రాతో పోల్చడమే అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
"బుమ్రా కంటే నసీం షా అద్భుతమైన ఫాస్ట్ బౌలర్. బుమ్రా ప్రస్తుతం ఫామ్‌లో ఉన్నాడు. ఇటువంటి ప్రదర్శనే నసీం 2021, 2022 టీ20 ప్రపంచకప్‌లలో చేశాడు. ఒక్కో ఏడాది ఒకొక్కరు బాగా రాణిస్తున్నారు. ఈ ఏడాది నసీం పెద్దగా తన మార్క్ చూపించలేకపోయాడు.
అయినప్పటకీ బుమ్రా కంటే నసీం ఎంతో బెటర్ అని" ఓ పోడ్‌కాస్ట్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇహ్సానుల్లా పేర్కొన్నాడు. కాగా మూడు ఫార్మాట్లలో బుమ్రా భారత్ తరపున ఇప్పటివరకు 408 వికెట్లు పడగొట్టాడు. మరోవైపు నసీం షా 112 వికెట్లు సాధించాడు.
చదవండి: Ravindra Jadeja: భారత్ విజయంపై ఆశలు పెట్టుకోవద్దు
Comments
Please login to add a commentAdd a comment