క్రిస్ట్‌చర్చ్: ఐదు ట్వంటీ20ల ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా ఆసీస్‌తో జరిగిన తొలి టీ20లో న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విశేషంగా రాణించిన కివీస్.. ఆసీస్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన బ్లాక్‌క్యాప్స్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 184 పరుగులు చేయగా, ఆపై ఆసీస్ 17.3 ఓవర్లలో 131 పరుగులకే ఆలౌటై ఘోర పరాజయం చవిచూసింది. కివీస్ నిర్దేశించిన 185 పరుగుల టార్గెట్‌లో ఆసీస్ చతికిలబడింది. మిచెల్ మార్ష్(45; 33 బంతుల్లో 5ఫోర్లు, 2సిక్స్‌లు)మాత్రమే రాణించగా మిగతా వారు విఫలమయ్యారు. ఇక్కడ చదవండి: వాళ్లు ఆలోచించరు.. మాకు అవసరమా: రోహిత్
మాథ్యూ వేడ్ (12), అరోన్ ఫించ్(1),జోష్ ఫిలిప్పి(2)లు తీవ్రంగా నిరాశపరిచారు. ఇక మిడిల్ ఆర్డర్‌లో మ్యాక్స్‌వెల్(1), మార్కస్ స్టోయినిస్(8)లు కూడా రాణించలేదు. దాంతో ఆసీస్ ఏ దశలోనూ కివీస్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. కివీస్ బౌలర్లలో ఇష్ సోథీ నాలుగు వికెట్లతో ఆసీస్‌ను దెబ్బ తీయగా, టిమ్ సౌతీ, ట్రెంట్ బౌల్ట్‌లు తలో రెండు వికెట్లు సాధించారు.టాస్ గెలిచిన ఆసీస్ ముందుగా ఫీల్డింగ్ ఎంచుకోవడంతో కివీస్ ముందుగా బ్యాటింగ్‌కు దిగింది.
కాగా, కివీస్‌కు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు గప్టిల్(0), సీఫెర్ట్(1)లు ఇద్దరూ నిరాశపరిచారు. అనంతరం కెప్టెన్ విలియమ్సన్(12) కూడా ఆకట్టుకోలేదు. కానీ తన కెరీర్‌లో ఏడో అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న కాన్వే చెలరేగి ఆడాడు. 59 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్స్‌లతో 99 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. తొలి సెంచరీ చేసే అవకాశాన్ని తృటిలో కోల్పోయాడు. చివరి బంతికి సింగిల్ మాత్రమే తీయడంతో సెంచరీని పరుగు దూరంలో మిస్సయ్యాడు. ఇక గ్లెన్ ఫిలిప్స్(30), నీషమ్(26)లు చివర్లో బ్యాట్ ఝుళిపించడంతో కివీస్ మంచి స్కోరు చేసింది. ఇక్కడ చదవండి: ‘అసలు కోహ్లి గురించి మీకేం తెలుసు?’
Comments
Please login to add a commentAdd a comment