
ఆక్లాండ్:వచ్చే నెలలో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో జరుగనున్న ముక్కోణపు టీ 20 సిరీస్‌లో ఇంగ్లండ్ ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్‌కు చోటు దక్కింది. ఓ వ్యక్తిపై దాడి కేసులో విచారణ ఎదుర్కొంటున్న బెన్ స్టోక్స్.. యాషెస్ సిరీస్‌తో పాటు ఆసీస్‌తో జరిగే వన్డే సిరీస్‌లో స్థానం కోల్పోయాడు.
తొలుత ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో స్టోక్స్ చోటు కల్పించినా దాడి కేసులో తుది తీర్పు ఇంకా పెండింగ్‌లోనే ఉన్న కారణంగా అతన్ని చివరి నిమిషంలో జట్టు నుంచి తొలగించారు. కాగా, ముక్కోణపు టీ 20 సిరీస్‌కు ఇంకా సమయం ఉన్నందును అప్పటికి స్టోక్స్ కేసు నుంచి బయటపడే అవకాశం ఉందని ఈసీబీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో స్టోక్స్ కు ఇంగ్లండ్ జట్టులో చోటు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment