
కోవిడ్ టీకా వేయించుకున్న నీల్ వేగనర్
వెల్లింగ్టన్: న్యూజిలాండ్ క్రికెటర్లు కోవిడ్ టీకాలు వేయించుకున్నారు. త్వరలో కివీస్ జట్టు ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ రెండు టెస్టుల సిరీస్‌తో పాటు భారత్‌తో ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌ను కూడా ఆడనుంది. ఈ నేపథ్యంలో మంగళవారం ఆటగాళ్లందరూ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోసు వేయించుకున్నారు. పలువురు ఆటగాళ్లు టీకా తీసుకున్న ఫొటోల్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశారు. టోక్యో ఒలింపిక్స్ కోసం న్యూజిలాండ్ అథ్లెట్లకు కూడా అక్కడి ప్రభుత్వం, జాతీయ ఒలింపిక్ సంఘం వ్యాక్సినేషన్ ప్రక్రియను మొదలుపెట్టింది.
అదే విధంగా కివీస్ పౌరుల సంపూర్ణ ఆరోగ్యమే లక్ష్యంగా ఇకపై న్యూజిలాండ్ పర్యటనకు వచ్చే ఏ దేశ అథ్లెట్లయినా సరే వాళ్లంతా వ్యాక్సిన్ తీసుకుంటేనే దేశంలోకి అనుమతిస్తారు. కొందరు క్రికెటర్లు ఐపీఎల్‌లో ఆడుతున్నారు. కేన్ విలియమ్సన్, సాన్‌ట్నెర్, బౌల్ట్, జేమీసన్ మెరుపుల లీగ్‌లో బిజీ కావడంతో తొలి డోసుకు దూరమయ్యారు. ఐపీఎల్ ముగిశాక స్వదేశం చేరగానే వీరికి కూడా టీకాలు వేస్తారు.
చదవండి: రెడ్‌లిస్ట్‌లో పెట్టారు.. అయినా ఫైనల్‌కు నో ప్రాబ్లమ్!
Comments
Please login to add a commentAdd a comment