న్యూఢిల్లీ: భారత స్టార్ మహిళా షూటర్ మనూ భాకర్ కోవిడ్ వ్యాక్సిన్ తొలి డోస్‌ను మంగళవారం తీసుకుంది. హరియాణాలోని ధక్లా గ్రామంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (సీహెచ్‌సీ)లో అమ్మ, నాన్నలతో పాటు తాను కూడా కోవిషీల్డ్ వ్యాక్సిన్‌ను తీసుకున్నట్లు ఆమె పేర్కొంది. టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనే క్రీడాకారులందరూ వ్యాక్సిన్‌కు అర్హులని గతంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో... భాకర్ వయసు 19 ఏళ్లే అయినా వ్యాక్సిన్ తీసుకోవడానికి వీలు పడింది. ఈ ఏడాది జూలై–ఆగస్టులలో జరిగే టోక్యో ఒలింపిక్స్‌లో మనూ భాకర్ షూటింగ్‌లోని మూడు ఈవెంట్స్‌లో (25 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల పిస్టల్, 10 మీటర్ల పిస్టల్ మిక్స్‌డ్ ఈవెంట్) భారత్‌కు ప్రాతినిధ్యం వహించనుంది.
చదవండి: ప్రపంచ యూత్ బాక్సింగ్ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు టాప్ ర్యాంక్
Comments
Please login to add a commentAdd a comment