పాక్‌తో క‌య్యానికి కాలు దువ్విన ఆఫ్గ‌న్ క్రికెట్ బోర్డు! | PAK-Angry-Afghan Cricket Board Promo-Maps-Pok-Gilgit-Baltistan-As-India | Sakshi
Sakshi News home page

పాక్‌తో క‌య్యానికి కాలు దువ్విన ఆఫ్గ‌న్ క్రికెట్ బోర్డు!

Sep 8 2026 5:21 PM | Updated on Sep 8 2026 6:08 PM

PAK-Angry-Afghan Cricket Board Promo-Maps-Pok-Gilgit-Baltistan-As-India

Photo Credit: Twitter

పాకిస్తాన్‌, అఫ్గానిస్తాన్‌ల మ‌ధ్య శ‌త్రుత్వం అంత‌కంత‌కూ పెరుగుతున్న‌ట్లుగా అనిపిస్తోంది. తాజాగా టీమిండియాతో సిరీస్ నేప‌థ్యంలో అఫ్గానిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) ఒక ప్ర‌చార వీడియోను రూపొందించిది. ఆ వీడియోల పాక్ ఆక్ర‌మిత క‌శ్మీర్ (పీవోకే), గిల్గిట్ బాల్టిస్తాన్‌ల‌ను భార‌తదేశ స‌రిహ‌ద్దులో భాగంగా చూపించింది.  ఈ వీడియోను ఏసీబీ త‌న అధికారిక ఎక్స్ ఖాతాలో పంచుకుంది.

"మా దేశం ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూస్తున్న సిరీస్ ఇది. ఘ‌న‌మైన‌ చ‌రిత్ర‌, సంస్కృతి, ఉమ్మ‌డి అభిరుచి క‌లిగిన రెండు దేశాల‌ను ఏకం చేసే సిరీస్ ఇది. ఇవి కేవ‌లం మ్యాచ్‌లు కాదు. స్వ‌దేశంలోని ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌ల ఆశ‌లు, గ‌ర్వాన్ని మోసుకుంటూ ఆఫ్గ‌న్ జ‌ట్టు మైదానంలోకి అడుగుపెట్ట‌నుంది."అని రాసుకొచ్చింది.

ఇప్ప‌టికే ఇరు దేశాల మ‌ధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బ‌తిన‌గా, తాజాగా ఆఫ్గ‌న్ క్రికెట్ బోర్డు చేప‌ట్టిన చ‌ర్య అగ్నికి ఆజ్యం పోసిన‌ట్లైంది. ఈ మ్యాప్‌పై పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (PCB) అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ దృష్టికి తీసుకెళ్లి ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. అయితే ఈ అంశంపై పాకిస్థాన్‌ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. అంతర్జాతీయ స్థాయిలో మాత్రం ఈ విషయాన్ని లేవనెత్తేందుకు ఇస్లామాబాద్‌ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

నిత్యం సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులతో సహా ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్‌ల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతున్న తరుణంలో ఈ తాజా వివాదం తలెత్తింది. దేశంలో జరుగుతున్న ఘోరమైన దాడులకు కారణమని పాకిస్తాన్ ఆరోపిస్తున్న తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్తాన్ (TTP)కు ఆఫ్ఘన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని ఇస్లామాబాద్ పదేపదే ఆరోపిస్తోంది. 

సాంస్కృతిక, క్రీడా వేదికలతో సహా సాఫ్ట్ పవర్ ద్వారా ఇటువంటి ఘర్షణలు మరింతగా వ్యక్తమయ్యే అవకాశం ఉందని భార‌త్ తెలిపింది. ఇక భార‌త్‌, అఫ్గానిస్తాన్‌ల మ‌ధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ సెప్టెంబ‌ర్ 13 నుంచి 17 మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. మ్యాచ్‌ల‌న్నీ ఢిల్లీలోని అరుణ్‌జైట్లీ స్టేడియం వేదిక‌గా జ‌ర‌గ‌నున్నాయి. తొలి వ‌న్డే ఈ నెల 13న‌, రెండో టీ20 15న‌, మూడో టీ20 17న జ‌ర‌గ‌నున్నాయి.

Read: నిప్పులు చెరిగిన ష‌మీ.. సౌత్‌జోన్‌ కకావికలం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement