gilgit baltistan
-
మంచుచరియల కింద సజీవ సమాధి
గిల్గిట్: పాకిస్తాన్లో మంచు చరియలు విరిగి పడిన ఘటనలో చిన్నారి సహా 10 మంది సజీవ సమాధి కాగా, మరో 25 మంది గాయపడ్డారు. ఆక్రమిత కశ్మీర్‌లోని కెల్ ప్రాంతంలోని సంచార గిరిజనులు మేకలను మేపుకుంటూ పక్కనే గిల్గిట్–బల్టిస్తాన్ ప్రాంతంలోని ఎస్తోర్‌కు వెళ్లారు. శనివారం తిరిగి వస్తుండగా షౌంటర్ పాస్‌లోని చంబేరి వద్ద వారిపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మహిళలు, నాలుగేళ్ల బాలుడు సహా 10 మంది చనిపోయారు. మరో 25 మంది వరకు గాయపడ్డారు. అననుకూల వాతావరణంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని అధికారులు తెలిపారు. -
అసలు పేరు ‘నగ్న పర్వతం’.. కానీ పర్యాటకులు మరోలా పిలుస్తారు!
కొన్ని ప్రయాణాలు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో అంతే భయాన్నీ క్రియేట్ చేస్తాయి. ప్రపంచంలోని అత్యంత ఎత్తయిన శిఖరాల్లో తొమ్మిదవ శిఖరంగా పేరున్న ‘నంగా పర్బత్’ పై జర్నీ కూడా అలాంటి అనుభవాన్నే ఇస్తుంది. పాకిస్తాన్‌లోని రెండవ ఎత్తయిన పర్వతం ఇది. ఆక్రమిత కాశ్మీరులోని గిల్గిట్ బాల్టిస్తాన్‌లో చిలాస్, అస్తోర్ ప్రాంతాల మధ్య ఉన్న ఈ శిఖరం ఎత్తు 26,660 అడుగులు (8,130 మీటర్లు). నంగా పర్బత్ అంటే ‘నగ్న పర్వతం’ అని అర్థం. 1953లో హెర్మన్ బుహ్ల్ (ఆస్ట్రియన్ జర్మన్) అనే పర్వతారోహకుడు మొదటిసారి ఈ పర్వతాన్ని అధిరోహించాడు. ఈ పర్వతం నిటారుగా ఉండడం వల్ల దీన్ని ఎక్కడం చాలా కష్టం. 20వ శతాబ్దం మొదట్లో ఈ పర్వతాన్ని అధిరోహించే ప్రయత్నంలో అనేకమంది మరణించడంతో దీనికి ‘కిల్లర్ పర్వతం’ అనే పేరూ వచ్చింది. ఇది చాలా ఇరుకైన రహదారి కావడంతో దీని మీద ప్రయాణం చాలా ప్రమాదకరం. కారకోరం హైవే దగ్గర ఆరంభమయ్యే ఈ పర్వత మార్గం గుండా.. 10 మైళ్ల దూరంలో ప్రయాణిస్తే ఒక అందమైన పల్లెటూరు వస్తుంది. ఈ క్యాంప్‌ను మోస్ట్ డేంజరెస్ అండ్ థ్రిల్లింగ్ టూర్ అంటారు పర్వత పర్యాటక ప్రియులు. -
పాకిస్తాన్‌కు సాయం నిలిపివేయండి: అల్తాఫ్
లండన్: మైనార్టీలపై అకృత్యాలకు పాల్పడుతున్న పాకిస్తాన్‌కు అందిస్తున్న సైనిక సహాయాన్ని నిలిపివేయాలని ముత్తహిద కైమీ ఉద్యమ నేత అల్తాఫ్ హుసేన్ అమెరికాకు విజ్ఞప్తి చేశారు. తద్వారా సింధు, బలూచిస్తాన్, ఖైబర్ ఫంక్తువా, గిల్గిట్ బల్టిస్తాన్‌లో నివసించే మైనార్టీలకు వేధింపుల నుంచి విముక్తి లభిస్తుందన్నారు. ఆల్- ఖైదా, తాలిబన్, లష్కర్-ఎ-తొయిబా, జైషే మహ్మద్ వంటి ఉగ్రసంస్థలను పాక్ ఐఎస్ఐ సృష్టించిందని.. వందలాది మంది ఉగ్రవాదులను తయారు చేసిందని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య ముసుగులో ఐఎస్ఐ చేస్తున్న అకృత్యాలకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని మండిపడ్డారు. ప్రజలను అత్యంత అణచివేతకు గురిచేసే ప్రపంచంలో ఏకైక ప్రభుత్వాన్ని నడిపిస్తోంది సైన్యమే అంటూ ఘాటు విమర్శలు చేశారు.(పాక్‌లో హిందువులపై పెచ్చుమీరుతున్న అకృత్యాలు) ఈ మేరకు అల్తాఫ్ పెంటగాన్‌కు లేఖ రాశారు. ‘‘పాకిస్తాన్ సైన్యం సింధు, బలూచిస్తాన్, కేపీకే, గిల్టిట్ బల్టిస్తాన్ ప్రాంతాలను ఆక్రమించింది. మైనార్టీలపై పాశవిక, క్రూర చర్యలకు పాల్పడుతోంది. నేటికీ అక్కడ అణచివేత కొనసాగుతోంది. శక్తిమంతమైన నిర్ణయాలు తీసుకునే మీ అధికారులు మరో కీలక నిర్ణయం తీసుకునే సమయం ఆసన్నమైంది. పాకిస్తాన్‌కు అందిస్తున్న పౌర, సైన్య సహకారాన్ని నిలిపివేయండి’’అని లేఖలో కోరారు. ఇక అమెరికాలో ఆగ్రహజ్వాలలకు కారణమైన నల్ల జాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై కూడా అల్తాఫ్ స్పందించారు. నిరసనకారులను శాంతింపజేసేందుకు అధికారులు తమ శాయశక్తులా కృషి చేస్తున్నారని.. అదే విధంగా జాతి వివక్షను పూర్తిగా నిర్మూలించే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. (లాక్డౌన్ ఎత్తివేస్తాం.. ఆ శక్తి లేదు: ఇమ్రాన్ ఖాన్) కాగా పాకిస్తాన్లో మైనార్టీలపై జరుగుతున్న అకృత్యాలను ప్రశ్నించేందుకు ముత్తాహిద కౌమీ ఉద్యమం పేరిట అల్తాఫ్ హుసేన్ 1984, మార్చి 18న పార్టీని స్థాపించారు. సెక్యూలర్ పార్టీగా పేరొందిన ఎంక్యూఎమ్ ప్రస్తుతం రెండు వర్గాలు చీలిపోయింది. ఎమ్‌క్యూఎమ్- లండన్ బాధ్యతలను అల్తాఫ్ పర్యవేక్షిస్తుండగా.. పాకిస్తాన్‌లోని పార్టీ విభాగాన్ని ఖాలిద్ మక్బూల్ సిద్ధిఖీ నడిపిస్తున్నారు. ముజాహిర్ల(పాకిస్తాన్‌కు వలస వచ్చిన ఉర్దూ మాట్లాడే ముస్లింలు) హక్కులకై పోరాడే ఎంక్యూఎమ్ 1990-1999 మధ్య కాలంలో పాకిస్తాన్ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించింది. చదవండి: హాంకాంగ్‌పై చైనా ఆధిపత్యం.. నేపాల్, పాకిస్తాన్ మద్దతు -
భారత్‌పై పాకిస్తాన్ తీవ్ర విమర్శలు
ఇస్లామాబాద్: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే)లోని గిల్గిట్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్లను జమ్మూ కశ్మీర్ సబ్ డివిజన్‌గా పేర్కొంటూ భారత వాతావరణ శాఖ నోటీసు జారీ చేయడంపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్ ఏకపక్ష నిర్ణయాలు జమ్మూ కశ్మీర్‌కు ఉన్న వివాదాస్పద స్టేటస్‌ను మార్చలేవని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. భారత్ బాధ్యతారాహిత్య, కవ్వింపు చర్యలకు ఇది నిదర్శనమంటూ రెచ్చిపోయింది. ఈ మేరకు పాకిస్తాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఓ ప్రకటన విడుదల చేశారు. ‘‘భారత్ విడుదల చేసిన ‘‘పొలిటికల్ మ్యాప్స్’’ చట్టపరంగా చెల్లవు. వాస్తవాలకు ఇవి పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. భారత్ చర్య ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుంది’’ అంటూ తీవ్ర విమర్శలు చేశారు. (భారత్‌పై ఇమ్రాన్ ఖాన్ తీవ్ర ఆరోపణలు) కాగా పీఓకేలోని గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతంలో ఎన్నికలు నిర్వహించాలంటూ పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ విషయంపై స్పందించిన.. భారత ప్రభుత్వం పాక్ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. భారత్‌లో అంతర్భాగమైన గిల్గిట్ బాల్టిస్తాన్‌కు సంబంధించి తీర్పులు వెలువరించే హక్కు దాయాది దేశ సుప్రీం కోర్టుకు లేదని స్పష్టం చేస్తూ.. భారత్ విదేశాంగ శాఖ అధికారికంగా పాక్ రాయబారికి దౌత్యపరమైన లేఖను అందజేసింది. కశ్మీర్‌లోని ఆక్రమించిన ప్రాంతాల్ని వెంటనే విడిచి వెళ్లాలని హెచ్చరికలు జారీ చేసింది. గిల్గిట్ బాల్టిస్తాన్‌పై సర్వాధికారాలూ తమవేనని ఈ సందర్భంగా భారత్ తేల్చి చెప్పింది. ఈ నేపథ్యంలో మే 6న విడుదల చేసిన వాతావరణ శాఖ బులెటిన్‌లో జమ్మూ అండ్ కశ్మీర్, లఢఖ్, గిల్గిట్ బాల్టిస్తాన్, ముజఫరాబాద్లను జమ్మూ కశ్మీర్‌లోని సబ్ డివిజన్లుగా పేర్కొంటూ మరోసారి కౌంటర్ ఇచ్చింది.(నలుగురు పాక్ సైనికుల హతం) -
గిల్గిట్ బాల్టిస్థాన్‌లో ఆందోళనలు
-
పాక్ ఆ ప్రాంతాలు విడిచి వెళ్లాల్సిందే: భారత్
-
పాక్ ఆ ప్రాంతాలు విడిచి వెళ్లాల్సిందే: భారత్
న్యూఢిల్లీ: ఆక్రమిత కశ్మీర్ భూభాగం, గిల్గిత్ బాల్తిస్థాన్ భూభాగం నుంచి పాకిస్థాన్ వెళ్లిపోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఎన్నో ఏళ్లుగా రెండు దేశాల మధ్య ఉన్న సమస్యకు ఇదే కారణమని చెప్పింది. ఈ మేరకు కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ గురువారం మీడియాతో మాట్లాడుతూ పాకిస్థాన్ అక్రమంగా ఏయే ప్రాంతాలను ఆక్రమించుకుందో వాటన్నింటిని వదిలేసి వెళ్లిపోవాల్సిందేనని డిమాండ్ చేశారు. కశ్మీర్ ప్రజల కోరుకుంటున్నట్లుగా ఆ సమస్యకు పరిష్కారం చూపే తీర్మానానికి తాను అనుకూలం అంటూ పాక్ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ ప్రకటించిన నేపథ్యంలో దానికి కౌంటర్‌గా కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. జమ్ముకశ్మీర్ విషయంలో భారత్, పాక్ మధ్య ఏదైనా సమస్య ఉందంటే అది ఒక్క పాక్ అక్రమంగా ఆక్రమించినదాని గురించే. అది పాక్ ఆక్రమిత కశ్మీర్ భూభాగం కావచ్చు. గిల్గిత్ బాల్తిస్థాన్ కావచ్చు. పాక్ అక్రమించిన భూభాగానికి తిరిగి ఎలా స్వాతంత్ర్యం ఇప్పించాలన్నది, తిరిగి భారత భూభాగంలో ఎలా కలపాలన్నదే ఇప్పుడు ప్రధానమైన అంశం’ అని ఆయన నొక్కి చెప్పారు. -
పాక్‌లో విన్యాసాలపై మాట మార్చిన రష్యా!
ఇస్లామాబాద్: పాకిస్థాన్‌తో కలిసి గిల్గిట్-బాల్టిస్తాన్‌లో తాను సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహిస్తున్నట్టు వస్తున్న వార్తలను రష్యా తోసిపుచ్చింది. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగమేనని, ఈ ప్రాంతంలో సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించడంపై భారత్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో రష్యా వివరణ ఇచ్చింది. సమస్యాత్మక, సున్నితమైన ప్రాంతాల్లో పాక్‌తో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహించబోమని ఢిల్లీలోని రష్యా రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ప్రచ్ఛన్న యుద్ధం నాటి శత్రువైన పాకిస్థాన్‌తో కలిసి రష్యా తొలిసారిగా సంయుక్త సైనిక విన్యాసాలు నిర్వహించబోతున్నది. ఇందుకోసం రావల్పిండికి రష్యా సైనలు తరలివచ్చాయి. అయితే, గల్గిట్-బాల్టిస్తాన్ పరిధిలో ఉన్న రట్టు పర్వత ప్రాంతాల్లో ఉన్న పాక్ సైనిక స్కూల్లో ఈ సంయుక్త డ్రిల్స్ ఉంటాయని రష్యా ప్రభుత్వ వార్తాసంస్థ టీఏఎస్ఎస్ (టాస్) కథనాన్ని ప్రచురించింది. ఈ కథనం భారత్‌ను తీవ్ర ఆందోళనకు గురిచేసింది. సమస్యాత్మకమైన ఈ ప్రాంతంలో రష్యాతో కలిసి సైనిక విన్యాసాలు నిర్వహిస్తే అది దాయాది దేశానికి దౌత్యపరమైన విజయం అవుతుంది. దీంతో అప్రమత్తమైన భారత్ గిల్గిట్-బాల్టిస్తాన్ భారత భూభాగమేనని స్పష్టం చేసింది. ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్‌తో కలిసి ఇలాంటి చర్యకు దిగడంపై రష్యాకు తమ ఆందోళన వ్యక్తం చేసినట్టు విదేశాంగ కార్యదర్శి వికాస్ స్వరూప్ ప్రకటించారు. దీంతో ఢిల్లీలోని రష్యా రాయబారా కార్యాలయం వెంటనే ఓ ప్రకటన విడుదల చేసింది. పీవోకేలో సంయుక్త సైనిక విన్యాసాలు ఉండబోవని స్పష్టం చేసింది. కేవలం చేరట్ ప్రాంతంలోనే డ్రిల్స్ ఉంటాయని, ఈ విషయంలో వచ్చిన కథనాలన్నీ తప్పుడువేనని తేల్చిచెప్పింది. దీంతో టాస్ కూడా తన కథనంలో పీవోకే ప్రస్తావనను తొలగించి.. కథనాన్ని ప్రచురించింది. -
పీఓకే ప్రాంతాన్ని పాక్ భూభాగమన్న చైనా
న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లోని ఓ భాగాన్ని పాక్ ప్రాంతంగా పేర్కొని చైనా మరో వివాదానికి తెర లేపింది. చైనా అధికార వార్తాసంస్థ ‘జినువా’ తన కథనంలో ‘చైనా, పాక్ సరిహద్దుల్లో ఉన్న ఖుంజెరబ్ కనుమ కీలకం. అది చైనాలోని జింజియాంగ్, పాక్‌లోని గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రాంతాలను కలుపుతుంది’ అని పేర్కొంది. గిల్గిత్ బాల్తిస్తాన్‌ను పీఓకేలో భాగంగా భారత్ భావిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఇలాంటి ప్రకటనే చేసిన చైనా భారత్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో వాటిని వెనక్కి తీసుకుంది.