పీఓకే ప్రాంతాన్ని పాక్ భూభాగమన్న చైనా | China says PoK belongs to Pak, raises eyebrows | Sakshi
Sakshi News home page

పీఓకే ప్రాంతాన్ని పాక్ భూభాగమన్న చైనా

Published Thu, Dec 4 2014 12:19 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

China says PoK belongs to Pak, raises eyebrows

న్యూఢిల్లీ: పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) లోని ఓ భాగాన్ని పాక్ ప్రాంతంగా పేర్కొని చైనా మరో వివాదానికి తెర లేపింది. చైనా అధికార వార్తాసంస్థ ‘జినువా’ తన కథనంలో ‘చైనా, పాక్ సరిహద్దుల్లో ఉన్న ఖుంజెరబ్ కనుమ  కీలకం. అది చైనాలోని జింజియాంగ్, పాక్‌లోని గిల్గిత్ బాల్తిస్తాన్ ప్రాంతాలను కలుపుతుంది’ అని పేర్కొంది. గిల్గిత్ బాల్తిస్తాన్‌ను పీఓకేలో భాగంగా భారత్ భావిస్తోంది. నాలుగేళ్ల క్రితం ఇలాంటి ప్రకటనే చేసిన చైనా భారత్ తీవ్ర అభ్యంతరం తెలపడంతో వాటిని వెనక్కి తీసుకుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement