మెల్‌బోర్న్: ఇటీవల కాలంలో బ్యాటింగ్, వికెట్ కీపింగ్‌ల్లో ఇరగదీస్తున్న టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్ పంత్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌ను భారత్ 3-1తో గెలిచిందంటే అందుకు పంత్‌నే ప్రధాన కారణమని ఆసీస్ దిగ్గజ ఆటగాడు ఇయాన్ చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఇంగ్లండ్‌తో జరిగిన చివరి టెస్టులో సెంచరీ (101) చేసి జట్టుకు విజయాన్ని అందించడాన్ని చాపెల్ ప్రధానంగా ప్రస్తావించాడు. ఈఎస్‌పీన్ క్రిక్ ఇన్ఫోకు రాసిన కాలమ్‌లో పంత్ ఆటను చాపెల్ ప్రశంసించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు ధాటిగా ఆడి రిషబ్ పంత్ మూడు టెస్టుల పరిస్థితులు మార్చాడు. చాలా మంది తమ కెరీర్ మొత్తంలో కూడా ఇలా చేయలేరు. అయితే ఈ యువ క్రికెటర్ తన దూకుడు బ్యాటింగ్‌తో ఇరగదీశాడు.
అదే సమయంలో కీపర్‌గా బాగా మెరుగయ్యాడు. పంత్ టీమిండియాలో పేరొందిన ఆటగాడు. అతడి స్ఫూర్తి, జట్టు ఆత్మవిశ్వాసానికి సరైన నిర్వచనం’ అని చాపెల్ తెలిపాడు.తొలి టెస్టులో ఓటమి పాలై ఆపై టీమిండియా పుంజుకుందంటే అందుకు పంత్ దూకుడైన ఆటే కారణమన్నాడు. ఇంగ్లిష్ ఆటగాళ్లు పరుగులు చేయడానికి విఫలమైన చోట పంత్ మాత్రం తన సహజసిద్ధంగా ఆడాడన్నాడు. కాగా, గతంలో పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలను ఎదుర్కొన్న రిషబ్ పంత్.. గత రెండు మూడు నెలల్లోనే భారత అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకడిగా ఎదిగాడు. ఆస్ట్రేలియా పర్యటనలో సిడ్నీ (97), గబ్బా (89) టెస్టుల్లో రెచ్చిపోయిన పంత్.. టీమిండియాకు చిరస్మరణీయ విజయం అందించిన విషయం తెలిసిందే.
ఇక తాజాగా ఇంగ్లండ్‌తోనూ జరిగిన చివరి టెస్టులో శతకం (101; 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్సర్లు) బాది.. మరోసారి తాను ఎంత విలువైన ఆటగాడో నిరూపించుకున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ సిరీస్‌లో పంత్ విశేషంగా రాణించాడు. 5 ఇన్నింగ్స్‌లలో 274 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 97. అదే విధంగా స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లోనూ మెరిశాడు. నిర్ణయాత్మక ఆఖరి టెస్టులో సెంచరీ చేశాడు. నాలుగు టెస్టుల్లో కలిపి 270 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇక్కడ చదవండి: చెలరేగిన ఇషాన్ కిషన్.. గెలిపించిన కోహ్లి
Comments
Please login to add a commentAdd a comment