పంత్‌ యాక్షన్‌.. కోహ్లి రియాక్షన్‌: వీడియో వైరల్‌ | Pant Action, Kohli Reaction In 1st Day Of 4th Test | Sakshi
Sakshi News home page

పంత్‌ యాక్షన్‌.. కోహ్లి రియాక్షన్‌: వీడియో వైరల్‌

Published Fri, Mar 5 2021 8:04 PM | Last Updated on Sat, Mar 6 2021 1:54 AM

Pant Action, Kohli Reaction In 1st Day Of 4th Test - Sakshi

అహ్మదాబాద్‌: టీమిండియా యువ వికెట్ కీపర్ రిషభ్‌ పంత్‌ మైదానంలోకి ఎంటరైతే అందరి కళ్లూ అతనిపై పడేలా చేస్తాడు. తాజాగా అహ్మదాబాద్‌లో భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్ట్ సందర్భంగా ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. అహ్మదాబాద్ టెస్ట్ మొదటి రోజు, పంత్ వికెట్ వెనుక చాలా చురుకుగా కనిపించాడు. అయితే ఇషాంత్‌ శర్మ వేసిన ఇన్నింగ్స్‌ ఏడో ఓవర్‌లో ఓ బంతిని పట్టుకునే క్రమంలో పంత్‌ చేసిన ఫీట్‌ ఇప్పుడు వైరల్‌గా మారింది. ఇషాంత్‌ బంతిని గుడ్‌ లెంగ్త్‌లో బ్యాట్స్‌మన్‌కు వేశాడు. ఇక్కడ చదవండి: ఒకే దెబ్బకు రోహిత్‌ శర్మ రెండు రికార్డులు

అది కాస్త బౌన్స్‌ కావడంతో కీపర్‌ పంత్‌ పట్టుకోవడానికి కష్టమైంది. కానీ బంతిని అందుకున్న పంత్‌ కింద పడ్డాడు. అదే సమయంలో వెంటనే జిమ్నాస్ట్‌ తరహాలో ఓ ఫీట్‌ చేసి యథాస్థానంలో నిలబడ్డాడు.  అప్పటికే పంత్‌ దగ్గరకు వచ్చిన కోహ్లి.. ఆ ఫీట్‌ను చూసి షాక్‌ అయ్యాడు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్‌గా మారింది.  తాజా టెస్టు మ్యాచ్‌ రెండో రోజు ఆటలో పంత్‌ సెంచరీ సాధించాడు.  118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్‌లతో 101 పరుగులు చేసి ఔటయ్యాడు. వాషింగ్టన్‌ సుందర్‌తో కలిసి వందకు పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశాడు. దాంతో టీమిండియా ఆధిక్యంలోకి వెళ్లింది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా 7 వికెట్ల నష్టానికి 294 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా 89 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. వాషింగ్టన్‌ సుందర్‌ 60 పరుగులతో అజేయంగా ఉన్నాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement