
Premier Handball League 2023- జైపూర్: ప్రీమియర్ హ్యాండ్‌బాల్ లీగ్‌లో హైదరాబాద్‌కు చెందిన తెలుగు టాలన్స్ జట్టు లీగ్ దశను విజయంతో ముగించింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో తెలుగు టాలన్స్ జట్టు 36–28 గోల్స్ తేడాతో గర్విత్ గుజరాత్ జట్టును ఓడించింది.
మొత్తం 10 మ్యాచ్‌లు ఆడిన టాలన్స్ 15 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచింది. తెలుగు టాలన్స్‌తోపాటు మహారాష్ట్ర ఐరన్‌మెన్, రాజస్తాన్ పేట్రియాట్స్ జట్లు సెమీఫైనల్ చేరుకోగా... చివరి సెమీఫైనల్ బెర్త్ కోసం ఢిల్లీ పంజెర్స్, గోల్డెన్ ఈగల్స్ ఉత్తరప్రదేశ్ జట్లు పోటీపడుతున్నాయి.
నేటి నుంచి గ్లోబల్ చెస్ లీగ్
దుబాయ్: అంతర్జాతీయ చెస్ సమాఖ్య (ఫిడే), టెక్ మహీంద్రా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దుబాయ్ వేదికగా నేటి నుంచి గ్లోబల్ చెస్ లీగ్ జరుగనుంది. మొత్తం ఆరు జట్లు (బాలన్ అలాస్కన్ నైట్స్, చింగారి గల్ఫ్ టైటాన్స్, గ్యాంజస్ గ్రాండ్‌మాస్టర్స్, ఆల్పైన్ వారియర్స్, త్రివేణి కాంటినెంటల్ కింగ్స్, అప్‌గ్రాడ్ ముంబా మాస్టర్స్) బరిలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment