సూపర్‌ డెలివరీ.. దెబ్బకు ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయింది | Prince Yadav destroys Ishan Kishan’s stumps with a peach in SRH vs LSG clash | Sakshi
Sakshi News home page

IPL 2026: సూపర్‌ డెలివరీ.. దెబ్బకు ఆఫ్‌ స్టంప్‌ ఎగిరిపోయింది

Apr 5 2026 6:44 PM | Updated on Apr 5 2026 7:30 PM

Prince Yadav destroys Ishan Kishan’s stumps with a peach in SRH vs LSG clash

ఐపీఎల్‌-2026లో ఉప్పల్ వేదికగా ఎస్‌ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ యువ పేసర్ ప్రిన్స్ యాదవ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. సన్‌రైజర్స్‌ హైదరాబాద్ కెప్టెన్ ఇషాన్ కిషన్ వికెట్‌ను తన మొదటి ఓవర్‌లోనే పడగొట్టి ప్రత్యర్థి జట్టును ప్రిన్స్ దెబ్బతీశాడు. ఈ లక్నో స్పీడ్ స్టార్ కిషన్‌ను అద్భుతమైన బంతితో బోల్తా కొట్టించాడు. ప్రిన్స్ యాదవ్ వేసిన డెలివరీకి ఇషాన్ వద్ద సమాధానమే లేకుండా పోయింది.

ఎస్‌ఆర్‌హెచ్ ఇన్నింగ్స్ నాలుగో ఓవర్ బౌలింగ్ చేసిన ప్రిన్స్ యాదవ్.. మూడో బంతిని గుడ్ లెంగ్త్ ఇన్ స్వింగర్‌గా సంధించాడు. బంతిని సరిగ్గా అంచనా వేయలేకపోయిన కిష‌న్‌, క‌వ‌ర్ డ్రైవ్ ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే బంతి బ్యాట్‌, ప్యాడ్ మ‌ధ్య ఉన్న గ్యాప్ నుంచి వెళ్లి ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది.

దీంతో కేవ‌లం ఒక్క ప‌రుగు మాత్ర‌మే కిష‌న్ పెవిలియ‌న్‌కు చేరాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల‌వుతోంది. ప్రిన్స్‌ యాదవ్‌ తన 4 ఓవర్ల కోటాలో 34 పరుగులిచ్చి 2 వికెట్లు సాధించాడు. ఢిల్లీతో జరిగిన మ్యాచ్‌లో కూడా ప్రిన్స్ రెండు వికెట్లు పడగొట్టాడు.

ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 156 పరుగులు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్‌(62), నితీశ్ కుమార్ రెడ్డి(56) హాఫ్ సెంచరీలతో రాణించారు.

చదవండి: Riyan Parag: ‘ఇదే నా హెచ్చరిక.. ఈసారి గట్టిగా కొట్టబోతున్నాం’
 

 

Advertisement
 
Advertisement
Advertisement