టీమిండియా లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ తన వైవిధ్యమైన బౌలింగ్‌తో అందరిని ఆకట్టుకున్నాడు. తీవ్రమైన పోటీ కారణంగా టీమిండియాలో అవకాశాలు దక్కించుకోలేనప్పటికి ఐపీఎల్ ద్వారా మరోసారి పలకరించనున్నాడు. రూ.4 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్(ఎల్‌ఎస్‌జీ)కు అమ్ముడైన రవి బిష్ణోయ్‌కు ఇది నాలుగో ఐపీఎల్ సీజన్. ఇప్పటివరకు 37 మ్యాచ్‌ల్లో 37 వికెట్లు తీశాడు. మార్చి 31న ఐపీఎల్ 16వ సీజన్‌కు తెరలేవనుంది.
శనివారం(ఏప్రిల్ 1న) ఢిల్లీ క్యాపిటల్స్‌తో లక్నో సూపర్ జెయింట్స్ తమ తొలి మ్యాచ్ ఆడనుంది. గతేడాది కేఎల్ రాహుల్ సారధ్యంలోని లక్నో మంచి ప్రదర్శనే కనబరిచింది. 14 మ్యాచ్‌ల్లో 9 విజయాలు, ఐదు ఓటములతో మూడో స్థానంలో నిలిచిన లక్నో.. కీలకమైన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఆర్‌సీబీ చేతిలో పరాజయం పాలైంది. రవి బిష్ణోయ్ లక్నో సూపర్ జెయింట్స్ తరపున 13 వికెట్లు తీసి పలు విజయాల్లో కీలకపాత్ర పోషించాడు.
ఈసారి కూడా అంతకుమించి ప్రదర్శన నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతున్న రవి బిష్ణోయ్ ఎల్‌ఎస్‌జీ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన క్రికెట్ జర్నీని వివరించాడు. ''2018లో నాకు రాజస్తాన్ రాయల్స్ నెట్ బౌలర్‌గా ఆఫర్ వచ్చింది. అదే సమయంలో 12వ తరగతి బోర్డు పరీక్షలు. కానీ క్రికెట్‌పై ఉన్న పిచ్చి ప్రేమ ఆ ఏడాది నన్ను బోర్డు పరీక్షలకు దూరం చేసింది. వృత్తి పరంగా ప్రభుత్వ ఉపాధ్యాయుడైన నాన్న నన్ను వెనక్కి రమ్మని ఆదేశించారు. అదే సమయంలో రాజస్తాన్ బౌలింగ్ కోచ్ క్యాంప్‌లోనే ఉండమన్నారు. దీంతో ఆ ఏడాది 12వ తరగతి బోర్డ్ ఎగ్జామ్‌లను రాయొద్దని నిర్ణయించుకొని నెట్ బౌలర్‌గా సేవలందించా. ఇంటికి వచ్చిన తర్వాత నాన్నను ఒప్పించడం తలకు మించిన బారంలా అనిపించింది.
మొత్తానికి ఏదోలా నాన్నను ఒప్పించి మరుసటి ఏడాది 12వ తరగతి పరీక్షలను పూర్తి చేశా. ఆ తర్వాత డిగ్రీ కంప్లీట్ చేసి క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించాను. ఇక పదేళ్ల వయసులోనే క్రికెట్ అకాడమీలో జాయిన అయిన నేను 15 ఏళ్లు వచ్చేసరికి చదువు ఆపేద్దామనిపించింది. కానీ నా తండ్రి సహా కోచ్‌లు చదువుతో పాటు క్రికెట్‌ను కంటిన్యూ చెయ్యాలి.. రెండింటిని బ్యాలెన్స్ చేస్తేనే రేపు జీవితంలో ఏదో ఒకటి సాధించగలవు. కావాలంటే డిగ్రీ పూర్తయ్యాకా క్రికెట్‌పై పూర్తి దృష్టి సారించు.. అంతేకాని చదువును నిర్లక్ష్యం చేయొద్దు అంటూ హితబోధ చేశారు.'' అంటూ తెలిపాడు.
ఇక అండర్-19 వరల్డ్‌కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన ఫైనల్లో ఓడిపోయిన తర్వాత జరిగిన పరిణామాలపై రవి బిష్ణోయ్ పంచుకున్నాడు. ''ఆరోజు ఫైనల్లో బంగ్లాదేశ్ ఆటగాళ్లు మా బ్యాటర్లపై అదే పనిగా స్లెడ్జింగ్‌కు దిగారు. తొలుత వాళ్లు లైన్ క్రాస్ చేయడంతోనే మేము గొడవకు దిగాం. వారు ముందు మొదలుపెట్టడంతో మాకు కూడా కోపం వచ్చింది. అయితే అప్పటి సంఘటన తర్వాత ఇంకెప్పుడు ఎవరిని స్లెడ్జ్ చేయొద్దని నిర్ణయించుకున్నా'' అంటూ చెప్పుకొచ్చాడు.
There is only one @bishnoi0056 when it comes to Cricket. Lekin off the field, ek Ravi Bishnoi toh hum sabme hain 🤭
— Lucknow Super Giants (@LucknowIPL) March 28, 2023
Hai na, #LSGBrigade? 👇#GazabAndaz | #LucknowSuperGiants | #LSGUnfiltered | #LSGTV | #LSG pic.twitter.com/xnvmXi2jHW
Comments
Please login to add a commentAdd a comment