ICC Mens T20 World Cup 2022 - India Vs England: టీమిండియా హెడ్‌కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లిలపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. గొప్ప త్యాగమే చేశారంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ విషయం ఏమిటంటే.. ప్రపంచకప్-2022 టోర్నీ సూపర్-12 దశ ఆఖరి మ్యాచ్‌లో జింబాబ్వేపై 71 పరుగులతో టీమిండియా నెగ్గిన విషయం తెలిసిందే.
అడిలైడ్‌లో
మెల్‌బోర్న్‌లో ఆదివారం ఈ మ్యాచ్ ముగించుకున్న భారత జట్టు.. గ్రూప్-2 టాపర్‌గా సెమీస్‌లో అడుగుపెట్టింది. ఈ క్రమంలో గురువారం (నవంబరు 10) నాటి రెండో సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఇందుకోసం అడిలైడ్‌కు విమానంలో పయనమైంది టీమిండియా.
ఇదిలా ఉంటే... మేజర్ టోర్నీ ప్రయాణాల్లో భాగంగా సాధారణంగా.. ప్రతి జట్టుకు నాలుగు బిజినెస్ క్లాస్ సీట్లు కేటాయిస్తారట. ఈ మేరకు అంతర్జాతీయ క్రికెట్ నియంత్రణ మండలి నిబంధనలు ఉండగా.. టీమిండియాలో కోచ్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్, స్టార్ ప్లేయర్ కోహ్లి సహా టీమ్ మేనేజర్‌కు ఈ సీట్లు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తోంది.
ఆ నాలుగు సీట్లు
ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియా పిచ్‌లు పేసర్లకు అనుకూలంగా ఉంటాయన్న విషయం తెలిసిందే. అందుకు తగ్గట్లుగానే భారత జట్టులో సీనియర్, స్వింగ్ సుల్తాన్ భువనేశ్వర్ కుమార్‌తో పాటు యువ ఫాస్ట్‌బౌలర్ అర్ష్‌దీప్ సింగ్, మరో సీనియర్ షమీని ఎంపిక చేశారు. వీరికి తోడుగా పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఉండనే న్నాడు. భువీ, అర్ష్ ఇప్పటికే ఈ టోర్నీలో తమను తాము నిరూపించుకోగా.. షమీ, పాండ్యా సైతం తమ వంతు పాత్ర పోషిస్తున్నారు.
వాళ్లు బాగుంటేనే
సెమీస్ మ్యాచ్‌లో వీరు మరింత కీలకం కానున్నారు. ఈ నేపథ్యంలో పేసర్లకు సౌకర్యంగా ఉండేందుకు, వాళ్లు మరింతగా రిలాక్స్ అయ్యేందుకు ద్రవిడ్, రోహిత్, కోహ్లి వారి కోసం తమ బిజినెస్ క్లాస్ సీట్లను త్యాగం చేశారట. టోర్నీ ఆసాంతం దాదాపు 34 వేల కిలోమీటర్ల మేర ప్రయాణం ఉండటంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఈ విషయం గురించి సహాయక సిబ్బందిలో ఒకరు ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌తో మాట్లాడుతూ.. ‘‘మా పేసర్లకు అన్ని రకాల సౌకర్యాలు ఇవ్వాలని టోర్నీ ఆరంభంలోనే మేము నిర్ణయించుకున్నాం. వాళ్లు వీలైనంతగా కాళ్లు స్ట్రెచ్ చేసుకోగలగాలి. అందుకు అనుగుణంగా వారి కోసం సౌకర్యాలు కల్పించాం’’ అని పేర్కొన్నారు.
చదవండి: Sania Mirza-Shoaib Malik: విడాకులకు సిద్ధమైన సానియా? ‘ఒకే ఒక్క ప్రేమ’ అని ఫరా కామెంట్.. ముక్కలైన హృదయం అంటూ..
WC 2022: ఇంగ్లండ్‌తో సెమీస్‌కు ముందు టీమిండియాకు ఎదురుదెబ్బ! రోహిత్‌కు గాయం?
Comments
Please login to add a commentAdd a comment