దక్షిణాఫ్రికా పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో వెస్టిండీస్‌తో మూడు వన్డేలు, మూడు టీ20లు ఆడనుంది. అయితే ప్రస్తుతం భారత్‌లో కరోనా థర్డ్‌వేవ్ ఉదృతి పెరుగుతుండంతో ఈ సిరీస్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే రంజీ ట్రోఫీ, కల్నల్ సి కె నాయుడు ట్రోఫీ, సీనియర్ మహిళల టీ20 లీగ్‌తో సహా పలు దేశీయ టోర్నమెంట్‌లను బీసీసీఐ వాయిదా వేసింది.
అయితే క్రికెట్.కామ్ నివేదిక ప్రకారం.. వెస్టిండీస్‌తో సిరీస్‌ను ఒకటి లేదా రెండు వేదికల్లో జరపాలని బీసీసీఐ భావిస్తోన్నట్లు సమాచారం. ఒక వేళ కరోనా ఉదృతి మరింత పెరిగినట్లయితే సిరీస్‌ను వాయిదా వేసిన ఆశ్చర్యపోనక్కరలేదు.కాగా ఫిబ్రవరి 6 న జరిగే తొలి వన్డేతో భారత్-వెస్టిండీస్ సిరీస్ మొదలు అవుతుంది. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం.. అహ్మదాబాద్, జైపూర్, కోల్‌కతా వన్డేలకు ఆతిథ్యం ఇవ్వనుండగా, కటక్, విశాఖపట్నం, తిరువనంతపురం మూడు టీ2లు జరగనున్నాయి.
"ఫిబ్రవరి మొదటి వారంలో కరోనా థర్డ్‌వేవ్ ఉదృతి మరింత పెరుగుతుంది. ఆరు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించడం,బయో-బబుల్ ఏర్పాట్లు చేయడం చాలా కష్టం" అని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. అంతేకాకుండా వెస్టిండీస్ సిరీస్‌ను ప్రేక్షకులు లేకుండానే బీసీసీఐ నిర్హహించున్నట్లు సమాచారం.
చదవండి: టీమిండియాకు భారీ షాక్.. మూడో టెస్ట్‌కు స్టార్ బౌలర్ దూరం!
Comments
Please login to add a commentAdd a comment