![Reports BCCI Official Says Hardik Pandya Thinking Of Test Retirement - Sakshi](/styles/webp/s3/article_images/2021/12/8/Hardik.jpg.webp?itok=euezTY9k)
Has Hardik Pandya Retirement Of Test Cricket? టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడా!.. అంటే అవుననే సమాధానం ఎక్కువగా వినిపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బంది పడుతున్న హార్దిక్ ప్రస్తుతం అన్ని ఫార్మాట్ల జట్లకు దూరమయ్యాడు. టి20 ప్రపంచకప్ అనంతరం జట్టు నుంచి ఉద్వాసనకు గురైన హార్దిక్ ప్రస్తుతం రీహాబిటేషన్ కోసం ఎన్‌సీఏ అకాడమీలో ఉన్నాడు. తాజాగా ఇన్‌సైడ్ స్పోర్ట్స్ కథనం ప్రకారం.. వన్డేలు, టి20లపై దృష్టి పెట్టేందుకు టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పనున్నాడని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు.
చదవండి: Ashwin-Ajaz Patel: ఎజాజ్ పటేల్‌కు అశ్విన్ సాయం.. ఫ్యాన్స్ ఫిదా
''హార్దిక్ పాండ్యా ప్రస్తుతం గాయాలతో ఇబ్బంది పడుతున్నాడు. దీనికి తోడు ఫామ్ కోల్పోయి జట్టుకు దూరమయ్యాడు. రీహాబిటేషన్ పేరుతో ఎన్‌సీఏ అకాడమీలో ఉన్న హార్దిక్ టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడు. అతను అధికారికంగా ఈ విషయం చెప్పకపోయినా సంకేతాలు మాత్రం అలాగే కనిపిస్తున్నాయి. వైట్‌బాల్ క్రికెట్‌పై ఫోకస్ పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నాడు. తొందర్లోనే అతను తన ఫామ్‌ను తిరిగి పొందుతాడు. ఎలాగు హార్దిక్ టెస్టు క్రికెట్ ఆడి మూడు సంవత్సరాలైంది. అతని వయస్సు 28 ఏళ్లు.. టీమిండియాకు మంచి ఆల్‌రౌండర్‌గా గుర్తింపు పొందిన హార్దిక్ రానున్న రెండు ప్రపంచకప్‌ల్లో కీలకంగా మారే అవకాశం ఉంది. అందుకోసం తను టెస్టు క్రికెట్‌కు గుడ్‌బై చెప్పే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.'' అంటూ చెప్పుకొచ్చాడు.
చదవండి: Mitchell Santner: మ్యాచ్ ఆడలేదు.. హీరో అయ్యాడు; అవార్డు గెలిచాడు
ఇక హార్దిక్ పాండ్యా టీమిండియా తరపున చివరి టెస్టును 2018లో ఇంగ్లండ్‌తో ఆడాడు. తన కెరీర్‌లో 11 టెస్టులు ఆడిన పాండ్యా 532 పరుగులు సహా 17 వికెట్లు తీశాడు. ఐపీఎల్ 2020 సీజన్‌కు ముందు వెన్నుముక సర్జీరీ చేయించుకున్న హార్దిక్ అప్పటినుంచి పెద్దగా రాణించింది లేదు. ఆల్‌రౌండర్ ట్యాగ్ ఉన్నప్పటికి ఐపీఎల్ 2020, ఐపీఎల్ 2021 సీజన్‌లో ఒక్కసారి కూడా బౌలింగ్ చేయలేదు. తాజాగా ముగిసిన టి20 ప్రపంచకప్‌లోనూ బౌలింగ్‌కు దిగని హార్దిక్ .. అటు బ్యాటింగ్‌లోనూ భారంగా మారి జట్టులో చోటు కోల్పోయాడు. ఇక దేశవాలీ టోర్నీ అయిన విజయ్ హజారే ట్రోఫీలో కూడా హార్దిక్ పాల్గొనడం లేదు. రీహాబిటేషన్ పేరుతో హార్దిక్ ఎన్‌సీఏకే పరిమితం అయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment