ఐపీఎల్ 2022 ముగిసిన తర్వాత టీమిండియా స్వదేశంలో సౌతాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. ఐపీఎల్ ఫైనల్ ముగిసిన 12 రోజుల వ్యవధిలోనే టీమిండియా సిరీస్ ఆడనుండడం ప్రాముఖ్యతను సంతరించకుంది. కాగా ఈ సిరీస్‌కు పలువురు సీనియర్ క్రికెటర్లకు రెస్ట్ ఇవ్వాలనే యోచనలో బీసీసీఐ ఉన్నట్లు సమాచారం. కోహ్లి సహా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, బుమ్రా, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీలకు విశ్రాంతి ఇవ్వనుంది. వీరి గైర్హాజరీలో శిఖర్ ధావన్ జట్టును నడిపించే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో రాణిస్తున్న పలువురు ఆటగాళ్లు ఈ సిరీస్‌కు ఎంపికయ్యే అవకాశం ఉంది. యువ రక్తంతో నిండిన జట్టు సౌతాఫ్రికాపై ఎలా రాణిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రానున్న టి20 ప్రపంచకప్ 2022 దృష్టిలో పెట్టుకొని చూస్తే ఈ సిరీస్ యువ ఆటగాళ్లకు మంచి అవకాశం అని చెప్పొచ్చు.
కాగా కోహ్లికి రెస్ట్ ఇవ్వడంపై అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేశారు. ఐపీఎల్ 2022లో కోహ్లి ఘోర ప్రదర్శన కొనసాగుతుంది. ఇప్పటివరకు ఆర్‌సీబీ తరపున 9 మ్యాచ్‌ల్లో 12 పరుగులు మాత్రమే చేశాడు. ఇందులో రెండు గోల్డెన్ డక్‌లు ఉన్నాయి. రోహిత్ రెగ్యులర్ కెప్టెన్ కావడం.. కోహ్లి మినహా మిగతా ఆటగాళ్లు ఐపీఎల్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నారు. ముఖ్యంగా రాహుల్ లక్నో సూపర్‌జెయింట్స్ కెప్టెన్‌గా సూపర్ ఫామ్ కనబరుస్తున్నాడు. బుమ్రా, జడేజాలు అంతగా రాణించనప్పటికి వారిపై పెద్దగా ప్రభావం లేదు. ఎటొచ్చి అసలు సమస్య కోహ్లి దగ్గరే మొదలైంది.
ఫామ్‌లేమితో సతమతమవుతున్న కోహ్లికి రెస్ట్ ఇవ్వడం సరైనదే అయినప్పటికి.. అయితే కేవలం ఒక్క సిరీస్‌కే పరిమితం చేస్తారా లేక పూర్తిగా టి20 లకు పక్కనబెట్టనున్నారా అనేది ఆసక్తికరంగా మారింది. అయితే జూలైలో టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లండ్‌లో టీమిండియా ఒక టెస్టు మ్యాచ్, ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ ఆడనుంది. సౌతాఫ్రికా సిరీస్‌కు మాత్రమే కోహ్లి దూరంగా ఉంటాడని.. ఇంగ్లండ్ పర్యటనకు అతను అందుబాటులో ఉంటాడని సెలక్షన్ కమిటీ అధికారి ఒకరు పేర్కొన్నారు.
''ఒక ఆటగాడు ఫామ్ కోల్పోవడం ఇప్పుడు కొత్తేం కాదు. కొద్దికాలం రెస్ట్ ఇస్తే అంతా సర్దుకుంటుంది. సౌతాఫ్రికాతో టి20 సిరీస్‌కు యువ ఆటగాళ్లకు అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో కోహ్లి సహా సీనియర్లకు రెస్ట్ ఇవ్వాలని భావిస్తున్నాం. ఒకవేళ కోహ్లి ఆడాలనుకుంటే అది కూడా పరిశీలిస్తాం. టీమ్ సెలక్షన్ మీటింగ్‌కు ముందు కోహ్లితో మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తాం'' అని చెప్పుకొచ్చాడు.
టీమిండియా-సౌతాఫ్రికా ఐదు మ్యాచ్‌ల టి20 సిరీస్ షెడ్యూల్:
►తొలి టి20- జూన్ 9, ఢిల్లీ
►రెండో టి20-జూన్ 12, కటక్
►మూడో టి20-జూన్ 14, విశాఖపట్నం
►నాలుగో టి20-జూన్ 17, రాజ్‌కోట్
►ఐదో టి20-జూన్ 19, బెంగళూరు
చదవండి: Michael Slater: మాజీ క్రికెటర్‌కు కోర్టులో ఊరట.. మెంటల్ హెల్త్ ఆస్పత్రికి తరలింపు!
Comments
Please login to add a commentAdd a comment