Virat Kohli Thinking Of Saying Goodbye To ODI And T20Is.. టీమిండియా మెషిన్ గన్ విరాట్ కోహ్లి త్వరలో వన్డే, టి20లకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాడా? అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై కోహ్లి రానున్న రోజుల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక సౌతాఫ్రికా టూర్‌లో కోహ్లి వన్డే సిరీస్‌కు దూరంగా ఉండనున్నట్లు సమాచారం. తనకు మరో అవకాశం ఇవ్వకుండా రోహిత్ శర్మను వన్డే కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించడం కోహ్లికి నచ్చకపోయి ఉండొచ్చని.. మరోవైపు గంగూలీ కూడా పరిమిత, టి20లకు ఇద్దరు కెప్టెన్లు కొనసాగే అవకాశం లేదంటూ పేర్కొడనం ఈ వాదనలకు మరింత బలం చేకూరింది.
చదవండి: Virat Kohli: "కోహ్లి ఫోన్ స్విచ్ఛాఫ్.. ఏమైందో నాకు తెలియదు"
బీసీసీఐ తీసుకున్న నిర్ణయం బహుశా విరాట్ కోహ్లీకి ఆగ్రహం తెప్పించి ఉండొచ్చు. అందుకే ముందే సమాచారం ఇచ్చినా.. అతను ఎలాంటి ప్రకటన చేయలేదు. బీసీసీఐ తనపై వేటు వేసిందని అందరికి తెలియాలనే అలా మౌనంగా ఉండిపోయాడు. అవసరమైతే పరిమిత ఓవర్ల ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పి కేవలం టెస్ట్ క్రికెట్‌లో మాత్రమే కొనసాగాలనే ఆలోచన కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కెప్టెన్సీ కోల్పోయిన విరాట్ కోహ్లీ వరుసగా రెండు, మూడు మ్యాచ్‌ల్లో విఫలమైతే జట్టులో చోటు ఉంటుందా అనేది ప్రశ్నర్థాకంగా మారనుంది. ఇక రోహిత్ కెప్టెన్సీలో కోహ్లీకి మద్దతు దొరుకుంతా అనేది చెప్పడం కూడా కష్టమే. వరుసగా విఫలమై జట్టులో చోటు కోల్పోతే మాత్రం విరాట్.. పరిమిత ఓవర్ల క్రికెట్‌కు గుడ్ బై చెప్పడం ఖాయమని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
చదవండి: 'కోహ్లికి కనీస గౌరవం ఇవ్వకుండానే తొలగించారు': పాక్ మాజీ క్రికెటర్
వాస్తవానికి 2023 వన్డే ప్రపంచకప్ కోసమే విరాట్ కోహ్లీ టీ20 కెప్టెన్సీని వదిలేశాడు. తీరికలేని షెడ్యూల్ కారణంగా తనపై ఉన్న ఒత్తిడిని తగ్గించుకోవడానికి టీ20 ఫార్మాట్ సారథ్య బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. ఆర్‌సీబీ కెప్టెన్సీని వదిలేశాడు. 2023 వన్డే ప్రపంచకప్ గెలిపించి.. గౌరవంగా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పాలనుకున్నాడు. కానీ బీసీసీఐ మాత్రం కోహ్లీ కెప్టెన్సీపై నమ్మకం లేక రోహిత్ శర్మను నియమించింది.
Comments
Please login to add a commentAdd a comment