Rishabh Pant- Car Accident- Treatment- BCCI: కారు ప్రమాదంలో గాయపడ్డ టీమిండియా యువ క్రికెటర్ రిషభ్ పంత్‌ను ముంబైకి తరలించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం డెహ్రాడూన్ ఆస్పత్రిలో ఉన్న 25 ఏళ్ల ఈ బ్యాటర్‌కు మెరుగైన చికిత్స అందించడం కోసం బీసీసీఐ ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. కాగా గతేడాది డిసెంబరు 30న ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు వెళ్తున్న సమయంలో పంత్ ఘోర రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
తీవ్ర గాయాలు
ఈ దుర్ఘటనలో అతడి కారు పూర్తిగా దగ్ధమైపోగా.. అదృష్టవశాత్తూ తను ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే, ఈ ప్రమాదంలో పంత్ తీవ్రంగా గాయపడ్డాడు. నుదురు, కుడి మోకాలి భాగం, కుడి ముంజేయి, పాదం, వెన్నెముకకు గాయాలయ్యాయి. ఈ క్రమంలో స్థానిక ఆస్పత్రికి తరలించగా అక్కడే చికిత్స పొందుతున్నాడు. సోమవారం అతడిని ఐసీయూ నుంచి ప్రైవేట్ వార్డుకు మార్చారు.
బీసీసీఐ ప్రత్యేక శ్రద్ధ
ఇదిలా ఉంటే.. పంత్ ఆరోగ్య పరిస్థితిపై దృష్టి సారించిన బీసీసీఐ.. స్పెషలిస్టులతో వైద్యం చేయించాలనే యోచనలో ఉంది. బీసీసీఐ ప్యానెల్ డాక్టర్లు పంత్ మెడికల్ రిపోర్టులు పరిశీలించిన తర్వాత అతడిని ముంబైకి షిఫ్ట్ చేయాలా లేదంటే విదేశాలకు పంపాలా అన్న అంశంపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.
అవసరమైతే అమెరికా లేదంటే లండన్‌కు పంత్‌ను తరలించనున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో గురించి ఢిల్లీ క్రికెట్ అసోసియేషన్ డైరెక్టర్ శ్యామ్ శర్మ మాట్లాడుతూ.. ‘‘ మెరుగైన చికిత్స కోసం క్రికెటర్ రిషభ్ పంత్‌ను ముంబైకి షిష్ట్ చేయనున్నారు’’ అని పేర్కొన్నాడు.
చదవండి: Sanju Samson: క్యాచ్ డ్రాప్ చేసిన సంజూ! హార్దిక్ పాండ్యా రియాక్షన్ వైరల్
Umran Malik: బుమ్రా రికార్డు బద్దలు కొట్టిన ఉమ్రాన్ మాలిక్.. త్వరలోనే అక్తర్‌ను కూడా!
Deepak Hooda: అసభ్య పదజాలం వాడిన హుడా! ఇంత నీచంగా మాట్లాడతావా అంటూ..
పంత్‌ను ప్రత్యేకంగా కలిసిన ఇద్దరు.. ఎవరో తెలుసా?
Comments
Please login to add a commentAdd a comment