ఐపీఎల్-2023లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఉత్కంఠ పోరులో 5 పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 11 పరుగులు అవసరమవ్వగా.. లక్నో బౌలర్ మొహ్సిన్ ఖాన్ అద్భుతంగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు.
క్రీజులో గ్రీన్, డేవిడ్ వంటి విధ్వంసకర ఆటగాళ్లు ఉన్నప్పటికీ మొహ్సిన్ సూపర్ బౌలింగ్ చేశాడు. కాగా 178 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకు ఓపెనర్లు రోహిత్ శర్మ(37), ఇషాన్ కిషన్(59) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 90 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
11 ఓవర్లు ముగిసే కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 103 పరగులతో పటిష్టంగా కన్పించిన ముంబై.. మిడిలార్డర్ విఫలమకావడంతో ఓటమిని చేజేతులా కొనితెచ్చుకుంది. ఈ ఓటమితో ముంబై ఇండియన్స్ నాలుగో స్థానానికి చేరుకుంది. ఇక ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ స్పందించాడు. తమ ఓటమికి కారణం బ్యాటింగ్ వైఫల్యమేనని రోహిత్ అంగీకరించాడు.
"మేము ఈ మ్యాచ్‌లో గెలిచే అంతా గొప్పగా ఆడలేదు. పిచ్‌ను బాగా అంచనా వేసాము. బ్యాటింగ్ చేయడానికి వికెట్ అద్భుతంగా ఉంది. ఈ స్కోర్‌ను మేము కచ్చితంగా ఛేజ్ చేస్తాము అని భావించాము. అయితే మా ఇన్నింగ్స్ సెకెండ్ హాఫ్‌లో మేము దారి తప్పాం. నేను, కిషన్ అద్భుతమైన ఆరంభం ఇచ్చాం. కానీ దురదృష్టవశాత్తూ మేము టార్గెట్‌ను అందుకోలేకపోయాం. నేను ఇది అస్సలు ఊహించలేదు.
అదే విధంగా లక్నో ఇన్నింగ్స్ ఆఖరి ఓవర్లలో కూడా మేము భారీగా పరుగులు సమర్పించుకున్నాం. ఇక స్టోయినిష్ అద్భుతంగా ఆడాడు. ఇలాంటి పిచ్‌పై స్ట్రైట్‌గా షాట్స్ ఆడితే బాగుంటుంది. స్టోయినిష్ అదే చేసి చూపించాడు. ప్లేఆఫ్ రేసు చాలా ఉత్కంఠంగా ఉంది. అయితే ప్లేఆఫ్స్ లెక్కలు ఎలా ఉంటాయో నాకు తెలీదు. కానీ మా చివరి గేమ్‌లో గెలవడం చాలా ముఖ్యం" అని పోస్ట్‌మ్యాచ్ ప్రేజేంటేషన్‌లో రోహిత్ పేర్కొన్నాడు.
చదవండి: IPL 2023: మొహ్సిన్ సూపర్ బౌలింగ్.. ఉత్కంఠ పోరులో లక్నో విజయం
Comments
Please login to add a commentAdd a comment