ఆసియా కప్ 2022 కోసం యూఏఈకు వెళ్లే ముందు టీమిండియా ఆటగాళ్లు ఫిట్‌నెస్ పరీక్షలకు హాజరు కానున్నారు. వెస్టిండీస్ పర్యటన ముగిసిన తర్వాత టీమిండియా ఆటగాళ్లు ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్నారు. అనంతరం రోహిత్ శర్మ నేతృత్వంలోని భారత జట్టు ఆగస్టు 18న బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో సమావేశం కానుంది. అక్కడ వారికి ఫిట్‌నెస్ పరీక్షలు నిర్వహించునున్నట్లు బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ మెరకు.. "ఆసియా కప్‌లో పాల్గొనే భారత బృందం ఆగస్టు 18న నేషనల్ క్రికెట్ అకాడమీలో సమావేశం కానుంది. వారు అక్కడ ఫిట్‌నెస్ పరీక్షలను ఎదుర్కొనున్నారు. ఇది ఆటగాళ్ల విరామం తర్వాత తప్పనిసరి ప్రోటోకాల్. ఇక ఆగస్టు 20న మా జట్టు ఆటగాళ్లు దుబాయ్‌కి బయలుదేరుతారు. అక్కడకి చేరుకున్నాక పాకిస్తాన్‌తో మ్యాచ్‌కు ముందు ప్రాక్టీస్ సెషన్ నిర్వహించనున్నాము" అని అతడు పేర్కొన్నారు.
మరోవైపు జింబాబ్వే వన్డే, ఆసియా కప్ రెండు జట్లులోను భాగమైన దీపక్ హుడా, అవేష్ ఖాన్ ఆగస్టు 22న సిరీస్ ముగిసిన తర్వాత నేరుగా అక్కడ నుంచి దుబాయ్‌కు చేరుకుంటారు. ఇక ఆసియాకప్-2022 యూఏఈ వేదికగా ఆగస్టు 27 నుంచి ప్రారంభం కానుంది. భారత్ తమ తొలి మ్యాచ్‌లో చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్‌తో ఆగస్టు 28 తలపడనుంది. ఇప్పటికే భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. ఈ మెగా టోర్నీకు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమయ్యాడు.
ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), కేఎల్ రాహుల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, దీపక్ హుడా, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), దినేష్ కార్తీక్ (వికెట్ కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, ఆర్. అశ్విన్, యుజ్వేంద్ర చాహల్, రవి బిష్ణోయ్, భువనేశ్వర్ కుమార్, అర్ష్‌దీప్ సింగ్, అవేష్ ఖాన్
చదవండి: Asia Cup 2022: టీమిండియాతో తొలి మ్యాచ్.. పాకిస్తాన్‌కు భారీ షాక్! ఇక కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment