IND Vs SL: Rohit Sharma Imitates Faf du Plessis Batting Stance, Video Viral - Sakshi
Sakshi News home page

IND vs SL 1st Test: ఏంటి రోహిత్‌.. డుప్లెసిస్ బ్యాటింగ్‌ను కాపీ కొడుతున్నావా..?

Published Sat, Mar 5 2022 10:59 AM | Last Updated on Sat, Mar 5 2022 12:45 PM

Rohit Sharma imitates Faf du Plessis batting stance  - Sakshi

1st IND vs SL 2022 Test: మొహాలీ వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టెస్టులో టీమిండియా దుమ్ము రేపుతుంది. తొలి రోజు శ్రీలంకపై భారత్‌ పూర్తి ఆధిపత్యం చెలాయించింది. తొలి రోజు రిషబ్‌ పంత్‌ విశ్వరూపం చూపించాడు. 97 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 96 పరుగులు సాధించాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్‌ 6 వికెట్ల నష్టానికి 357 పరుగులు చేసింది. ఇక విరాట్‌ కోహ్లి తన టెస్ట్‌ కెరీర్‌లో 100వ టెస్ట్‌ మ్యాచ్‌ ఆడాడు. మ్యాచ్‌ ప్రారంభానికి ముందు బీసీసీఐ కోహ్లిను సత్కరించింది. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కోహ్లి 45 పరుగులు చేసి నిరాశపరిచాడు.

ఇక టీమిండియా టెస్ట్‌ కెప్టెన్‌గా తొలి సారి బాధ్యతలు చేపట్టిన రోహిత్‌ శర్మ.. మొదటి మ్యాచ్‌లోనే నిరాశపరిచాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 29 పరుగుగులు మాత్రమే చేసి పెవిలియన్‌కు చేరాడు. ఇది ఇలా ఉంటే.. ఇన్నింగ్స్‌ 43వ ఓవర్‌లో విరాట్‌ కోహ్లి 40 పరుగుల వద్ద బ్యాటింగ్‌ చేస్తుండగా... కెమెరాలు ఒక్కసారిగా డ్రెస్సింగ్ రూమ్‌ వైపు ఫోకస్‌ చేశాయి. ఈ క్రమంలో డ్రెస్సింగ్ రూమ్‌లో కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. దక్షిణాఫ్రికా మాజీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ బ్యాటింగ్‌  స్టైల్‌ను అనుకరిస్తూ కనిపించాడు.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

చదవండి: PAK Vs AUS: భయపడిందే జరిగింది.. పెషావర్‌లో బాంబు దాడి; ఆందోళనలో క్రికెట్‌ ఆస్ట్రేలియా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement