తిరువనంతపురం వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ బ్యాటర్‌గా విఫలమైనప్పటికి.. కెప్టెన్‌గా మాత్రం సఫలమయ్యాడు.ఈ ఏడాదిలో ఇది రోహిత్‌కు కెప్టెన్‌గా 16వ టీ20 విజయం. తద్వారా రోహిత్ శర్మ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒక క్యాలెండర్ ఈయర్‌లో టీ20ల్లో అత్యధిక విజయాలు సాధించిన భారత కెప్టెన్‌గా రోహిత్ రికార్డులకెక్కాడు. అంతకుముందు ఈ ఘనత టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పేరిట ఉండేది. 2016 ఏడాదిలో ధోని సారథ్యంలో భారత్ 15 టీ20 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది.
తాజా మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధించడంతో ధోని రికార్డును రోహిత్ బ్రేక్ చేశాడు. కాగా తొలి టీ20లో విజయం సాధించిన టీమిండియా.. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ఆధిక్యంలో నిలిచింది. ఇక భారత్-దక్షిణాఫ్రికా మధ్య రెండో టీ20 గహుతి వేదికగా ఆక్టోబర్ 2న జరగనుంది.
చదవండి: T20 World Cup 2022: బుమ్రా దూరం.. సరైన బౌలర్లు లేరు; టీమిండియాకు కష్టమే!
Comments
Please login to add a commentAdd a comment