ధోనీ అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ | IND Vs SA 1st Test: Rohit Sharma On Verge Of Surpassing MS Dhoni In Elite List - Sakshi
Sakshi News home page

IND Vs SA 1st Test: ధోనీ అరుదైన రికార్డుపై కన్నేసిన రోహిత్ శర్మ

Published Mon, Dec 25 2023 8:16 PM | Last Updated on Tue, Dec 26 2023 11:48 AM

IND vs SA 1st Test: Rohit Sharma on verge of surpassing MS Dhoni in elite list - Sakshi

వన్డే వరల్డ్‌కప్‌-2023 ఓటమి తర్వాత విశ్రాంతి తీసుకున్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తిరిగి మైదానంలో అడుగుపెట్టేందుకు సిద్దమయ్యాడు. దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌లో భారత జట్టును హిట్‌మ్యాన్‌ నడిపించనున్నాడు. రోహిత్‌తో పాటు సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లి, జస్ప్రీత్‌ బుమ్రా ఈ సిరీస్‌లో భాగం కానున్నారు. డిసెంబర్‌ 26 నుంచి సెంచూరియన్‌ వేదికగా జరగనున్న తొలి టెస్టుతో ఈ సిరీస్‌ ప్రారంభం కానుంది.

అయితే తొలి టెస్టుకు ముందు రోహిత్‌ శర్మను ఓ అరుదైన రికార్డు ఊరిస్తోంది. మొదటి టెస్టులో హిట్‌మ్యాన్‌ మరో 2 సిక్స్‌లు కొడితే.. టెస్టు క్రికెట్‌లో అత్యధిక  సిక్స్‌లు బాదిన రెండో భారత ఆటగాడిగా రికార్డులెక్కుతాడు.

ఈ క్రమంలో భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనిని రోహిత్‌ అధిగమిస్తాడు. టెస్టుల్లో ఇప్పటివరకు రోహిత్‌ శర్మ(77 సిక్స్‌లు), ధోని(78) సిక్స్‌లు బాదాడు. ఇక ఈ అరుదైన ఘనత సాధించిన జాబితాలో టీమిండియా మాజీ ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్(90) తొలి స్ధానంలో ఉన్నాడు.
చదవండి: IND vs SA: దక్షిణాఫ్రికాతో తొలి టెస్టు.. టీమిండియా ఫ్యాన్స్‌కు బ్యాడ్‌ న్యూస్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement