రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు.. రెండో కెప్టెన్‌గా | Rohit Sharma joins MS Dhoni as only other Indian captain for Unwanted record in IND vs SA Test | Sakshi
Sakshi News home page

IND vs SA: రోహిత్‌ శర్మ అత్యంత చెత్త రికార్డు.. రెండో కెప్టెన్‌గా

Published Fri, Dec 29 2023 10:33 AM | Last Updated on Fri, Dec 29 2023 3:07 PM

Rohit Sharma joins MS Dhoni as only other Indian captain for Unwanted record in IND vs SA Test - Sakshi

సెంచూరియన్‌ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ దారుణ ప్రదర్శరన కనబరిచాడు.

రెండు ఇన్నింగ్స్‌లు కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు. కాగా తొలి ఇన్నింగ్స్‌లో 5 పరుగులు చేసిన రబాడ.. రెండో ఇన్నింగ్స్‌లో డకౌట్‌గా వెనుదిరిగాడు. రబాడ బౌలింగ్‌లో రోహిత్‌ క్లీన్‌ బౌల్డయ్యాడు. ఈ క్రమంలో హిట్‌మ్యాన్‌ ఓ చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.

దక్షిణాఫ్రికాతో టెస్టు క్రికెట్‌లో డకౌటైన రెండో భారత కెప్టెన్‌గా రోహిత్‌ నిలిచాడు. ఈ చెత్తరికార్డు సాధించిన జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోని ఉన్నాడు. 2011 ప్రోటీస్‌తో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ధోని డకౌట్‌గా వెనుదిరిగాడు. తాజా మ్యాచ్‌తో రోహిత్‌ కూడా ఈ జాబితాలోకి చేరాడు. కాగా టెస్టుల్లో హిట్‌మ్యాన్‌ను రబాడ ఔట్‌ చేయడం 14వ సారి కావడం గమనార్హం.
చదవండిIND vs SA: గెలుపు జోష్‌లో ఉన్న సౌతాఫ్రికాకు బిగ్‌ షాక్‌..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement