టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోను యూట్యూబ్‌లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్ పేజీలో 10 కోట్ల వ్యూస్ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. గతంలో ఏ వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు.
పాక్‌పై రోహిత్ మెరుపు శతకం విషయానికొస్తే.. జూన్ 16, 2019లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో (వరల్డ్‌కప్) తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (65 బంతుల్లో 77; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 చేసింది.
Rohit Sharma's Hundred vs Pakistan in 2019 WC became the first ever video to cross 100 million views on the ICC YouTube page.
— Johns. (@CricCrazyJohns) March 27, 2023
ఛేదనకు దిగిన పాక్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా వర్షం పడింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 40 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ 302 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే పాక్ 216 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment