world cup match
-
ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ అంటే ఆ క్రేజే వేరు
-
హైదరాబాద్ లో వరల్డ్ కప్ మ్యాచ్ లేనట్టే
-
రోహిత్ శర్మ వీడియోను 10 కోట్ల మందికిపైగా చూశారు.. ఆ వీడియో ఏదంటే..?
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోను యూట్యూబ్‌లో 10 కోట్ల మందికి పైగా వీక్షించారు. 2019 వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌పై హిట్‌మ్యాన్ చేసిన 140 పరుగుల విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించిన వీడియోకు ఐసీసీ యూట్యూబ్ పేజీలో రికార్డు స్థాయి వ్యూస్ దక్కాయి. ఐసీసీ యూట్యూబ్ పేజీలో 10 కోట్ల వ్యూస్ దాటిన తొలి వీడియో ఇదే కావడం విశేషం. గతంలో ఏ వీడియోకు ఈ స్థాయిలో వ్యూస్ రాలేదు. పాక్‌పై రోహిత్ మెరుపు శతకం విషయానికొస్తే.. జూన్ 16, 2019లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో (వరల్డ్‌కప్) తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. రోహిత్ శర్మ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు), విరాట్ కోహ్లి (65 బంతుల్లో 77; 7 ఫోర్లు), కేఎల్ రాహుల్ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించడంతో నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 చేసింది. Rohit Sharma's Hundred vs Pakistan in 2019 WC became the first ever video to cross 100 million views on the ICC YouTube page. — Johns. (@CricCrazyJohns) March 27, 2023 ఛేదనకు దిగిన పాక్ 40 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 216 పరుగుల వద్ద ఇన్నింగ్స్‌ను కొనసాగిస్తుండగా వర్షం పడింది. వర్షం ఎంతకీ తగ్గకపోవడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్‌ను విజేతగా ప్రకటించారు. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 40 ఓవర్లు పూర్తయ్యే సరికి పాక్ 302 పరుగులు చేయాల్సి ఉండింది. అయితే పాక్ 216 పరుగులకే పరిమితం కావడంతో భారత్ 89 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
అనంతలో అంధుల టీ-20 వరల్డ్ కప్ మ్యాచ్
అనంతపురం సప్తగిరి సర్కిల్ : అనంతలో అంధుల ప్రపంచ క్రికెట్ టోర్నీ మ్యాచ్ నిర్వహిస్తున్నట్లు సమర్థనం డిజేబుల్డ్ సంస్థ సభ్యులు వెంకటనారాయణ తెలిపారు. ఈ నెల 7న స్థానిక అనంత క్రీడా మైదానంలో వెస్టిండీస్, సౌతాఫ్రికా జట్ల మధ్య అంధుల ప్రపంచ క్రికెట్ టోర్నీ టీ–20 మ్యాచ్‌ను నిర్వహిస్తున్నామన్నారు. మ్యాచ్ ఉదయం 9:30 గంటలకు ప్రారంభమవుతుందన్నారు. ఈ క్రీడా పోటీలు జనవరి 28 నుంచి ఫిబ్రవరి 12 వరకు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్నాయని చెప్పారు. ఇందులో భాగంగానే అనంతలో ఈ మ్యాచ్‌ను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ టోర్నీలో భారత్, పాకిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, న్యూజిల్యాండ్, ఇంగ్లాండ్, నేపాల్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు పాల్గొంటున్నాయన్నారు. ఫైనల్ మ్యాచ్ ఈనెల 12న బెంగుళూరులో జరుగుతుందని వెల్లడించారు. -
ఇప్పుడు ‘ఒంటె’ వంతు!
గత వరల్డ్‌కప్‌లో ఆక్టోపస్ ‘పాల్’ తరహాలో ఈ సారి కూడా ప్రపంచకప్ మ్యాచ్‌ల భవిష్యత్తు చెప్పేందుకు అనేక జంతువులు సిద్ధమయ్యాయి. బిగ్ హెడ్ అనే తాబేలు, ఫ్లాప్సీ (కంగారూ), పాండాస్ (చైనా), నెల్లీ (ఏనుగు), రూ (కుక్క)లను చాలా మంది ఈ జాబితాలో చేర్చారు. తాజాగా ఇప్పుడు ‘ఎడారి ఓడ’ కూడా నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఎమిరేట్స్‌కు చెందిన ఒంటె ‘షహీన్’ మ్యాచ్‌ల ఫలితాన్ని సరిగ్గా అంచనా వేస్తోందంటూ అక్కడి మీడియా చెబుతోంది. అది చెప్పినట్లుగా 100 శాతం ఫలితాలు వచ్చాయని, ముఖ్యంగా స్పెయిన్-నెదర్లాండ్స్, ఇంగ్లండ్- ఇటలీ మ్యాచ్‌ల గురించి షహీన్ ఒక్కటే సరిగ్గా చెప్పిందని, మిగిలిన జంతువులు అన్ని మ్యాచ్‌లను కచ్చితంగా అంచనా వేయలేకపోయాయని ప్రచారం జరుగుతోంది. -
బంతి చాటు వల!
ఫిఫా ప్రపంచకప్ మ్యాచ్ టికెట్లు ఉచితం... అమితాబ్ బచ్చన్ మృతి... ఇదిగో వార్త, వీడియో లింక్! లాటరీ కొట్టేశారు... నగదు అందుకోవాలంటే...? ఇలాంటి ఫేస్బుక్ పోస్టింగ్స్, ఈమెయిళ్లు ఈమధ్య తరచూ కనబడుతున్నాయా? ఆసక్తి కొద్దో.. ఆశకొద్దో లింక్‌లు ఓపెన్ చేస్తున్నారా? అయితే మీరు హ్యాకర్ వలలో చిక్కినట్లే. హ్యాకర్ల గురించి, సైబర్ నేరాల గురించి కొత్తగా చెప్పేందుకు ఏమీ లేకపోదు. కానీ.. జూన్‌లో జరగనున్న ప్రపంచకప్ సాకర్ పోటీల నేపథ్యంలో వారు కొత్త కొత్త ఐడియాలు, ట్రిక్కులతో మిమ్మల్ని వలలో వేసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. ప్రఖ్యాత ఇంటర్నెట్ సెక్యూరిటీ సంస్థలు సెమాంటిక్, నార్టన్ చెబుతున్నదాని ప్రకారం.. ఉచిత టికెట్లు, లాటరీల ముసుగులో ఇటీవలి కాలంలో హ్యాకర్ల విజృంభణ ప్రారంభమైంది. కాబట్టి జర జాగ్రత్త! దేశంలో ఫుట్‌బాల్‌పై ఆసక్తి తక్కువే కావచ్చుగానీ.. పాశ్చాత్యదేశాల్లో ఈ ఆటకున్న క్రేజ్ అంతా యిఇంతా కాదు. దీన్ని ఆసరాగా చేసుకుని హ్యాకర్లు రకరకాల మోసాలకు పాల్పడే అవకాశముంది. వీరి బుట్టలో పడితే... మీ బ్యాంక్ అకౌంట్లలోని డబ్బు మాయమైపోవచ్చు... లేదా వ్యక్తిగత ఆర్థిక సమాచారాన్ని ఇతరులు దొంగిలించవచ్చు. ఇదీకాదంటే.. మీ కంప్యూటర్/స్మార్ట్ఫోన్లలో మాల్వేర్ చేరిపోయి... మిమ్మల్ని సతాయించవచ్చు. ఇప్పటికే ఇలాంటి మోసాలకు తోడ్పడే మెయిళ్లు నెట్లో షికార్లు చేస్తున్నాయని బ్యాంకింగ్ సర్వీసుల పేర్లతోనూ లింక్‌లు నెట్‌నిండా కనిపిస్తున్నాయని సెమాంటిక్ సెక్యూరిటీస్ గుర్తించింది. 'You are the winner of a pair of tickets to the FIFA World cup 2014 Brazil!'. "To promote World Cup 2014, you must register to compete for prizes worth 20 thousand Reais on behalf of CIELO a Brazilian credit and debit card operator". లాంటి శీర్షికలతో ఈ మెయిళ్లు/లింకులు కనిపిస్తే వాటిని తెరవవద్దని హెచ్చరిస్తోంది. రెస్ట్ ఇన్ పీస్ స్కామ్! అకస్మాత్తుగా ‘అమితాబ్ బచ్చన్ మృతి.. వీడియో లింక్’ అన్న శీర్షికతో ఫేస్బుక్లో పోస్టింగ్ కనిపించిందనుకోండి... ఏం చేస్తారు? ముందు వెనుకలు ఆలోచించకుండా... మరింత సమాచారం తెలుసుకునేందుకు, లేదా వీడియో చూసేందుకు లింక్‌ను క్లిక్ చేస్తారు. అదికాస్తా ప్రకటనలకు, లేదా సర్వేల సైట్లకు దారితీస్తుంది. ఎంత ఎక్కువ మంది క్లిక్ చేస్తే స్పామర్/హ్యాకర్‌కు అంత డబ్బు అన్నమాట. ఈ క్రమంలో మీ వ్యక్తిగత, ఇష్టాయిష్టాల సమాచారం ఇతరులకు తెలిసిపోతుందన్నమాట. నార్టన్ సంస్థ అంచనాల ప్రకారం... సైబర్ మోసాలకు బలయ్యే వాళ్లు భారత్‌లో ఎక్కువ. ర్యాన్సమ్ వేర్, ఐడెంటిటీ థెఫ్ట్ మోసాలకు 11 శాతం చొప్పున, ఫిషింగ్‌కు 9 శాతం మంది బలవుతున్నారు. ఇలా చేయండి... సోషల్ మీడియా వెబ్సైట్లలో వచ్చే సంచలనాత్మక కథనాలను చదివే విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఎన్నడూ వినని, కనని వెబ్సైట్ల నుంచి ప్లగ్ఇన్స్ లేదా ఇతర టూల్స్‌ను ఇన్స్టాల్ చేసుకోవద్దు. వెరిఫికేషన్ సర్వేల విషయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి. గుర్తుతెలియని వ్యక్తులు, సంస్థల నుంచి వచ్చే లింక్‌లను క్లిక్ చేయవద్దు పీసీ/స్మార్ట్ఫోన్ల సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోండి. యాంటీస్పామ్ సిగ్నేచర్ల అప్డేషన్ కూడా అవసరమని గుర్తుంచుకోండి.