ఇప్పుడు ‘ఒంటె’ వంతు!
గత వరల్డ్‌కప్‌లో ఆక్టోపస్ ‘పాల్’ తరహాలో ఈ సారి కూడా ప్రపంచకప్ మ్యాచ్‌ల భవిష్యత్తు చెప్పేందుకు అనేక జంతువులు సిద్ధమయ్యాయి. బిగ్ హెడ్ అనే తాబేలు, ఫ్లాప్సీ (కంగారూ), పాండాస్ (చైనా), నెల్లీ (ఏనుగు), రూ (కుక్క)లను చాలా మంది ఈ జాబితాలో చేర్చారు. తాజాగా ఇప్పుడు ‘ఎడారి ఓడ’ కూడా నేనున్నానంటూ ముందుకొచ్చింది. ఎమిరేట్స్‌కు చెందిన ఒంటె ‘షహీన్’ మ్యాచ్‌ల ఫలితాన్ని సరిగ్గా అంచనా వేస్తోందంటూ అక్కడి మీడియా చెబుతోంది. అది చెప్పినట్లుగా 100 శాతం ఫలితాలు వచ్చాయని, ముఖ్యంగా స్పెయిన్-నెదర్లాండ్స్, ఇంగ్లండ్- ఇటలీ మ్యాచ్‌ల గురించి షహీన్ ఒక్కటే సరిగ్గా చెప్పిందని, మిగిలిన జంతువులు అన్ని మ్యాచ్‌లను కచ్చితంగా అంచనా వేయలేకపోయాయని ప్రచారం జరుగుతోంది.