సౌతాఫ్రికా క్రికెట్ జట్టు టీ20ల్లో భారీ పరాజయాన్ని ఎదుర్కొంది. మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా స్వదేశంలో (డర్బన్) ఆస్ట్రేలియాతో నిన్న (ఆగస్ట్ 30) జరిగిన తొలి మ్యాచ్‌లో 111 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైన ప్రొటీస్.. అంతర్జాతీయ టీ20ల్లో పరుగుల పరంగా అతి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. పరుగుల పరంగా సఫారీలు టీ20ల్లో ఎదుర్కొన్న భారీ పరాజయాల్లో టాప్-4 ఆసీస్ చేతుల్లోనే కావడం విశేషం.
Australia has handed South Africa four out of their five biggest defeats in terms of runs in T20Is.#SAvsAUS pic.twitter.com/rW0OABPfk6
— CricTracker (@Cricketracker) August 31, 2023
నిన్నటి మ్యాచ్ తర్వాత అతి పెద్ద పరాజయాన్ని సౌతాఫ్రికా 2020లో ఎదుర్కొంది. జోహన్నెస్‌బర్గ్ వేదికగా జరిగిన ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 107 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. ఆ తర్వాత అతి భారీ పరాజయాన్ని కూడా సౌతాఫ్రికా అదే ఏడాది చవిచూసింది. 2020లో కేప్‌టౌన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 97 పరుగుల తేడాతో ఓటమిపాలయ్యారు. దీని తర్వాతి భారీ పరాజయం సౌతాఫ్రికాకు 2006లో ఎదురైంది. నాడు బ్రిస్బేన్‌లో జరిగిన మ్యాచ్‌లో సఫారీలు 95 పరుగుల తేడాతో ఆసీస్ చేతిలో చిత్తయ్యారు. ఇలా టీ20ల్లో పరుగుల పరంగా సౌతాఫ్రికా ఎదుర్కొన్న భారీ పరాజయాలన్నీ ఆసీస్ చేతిలోనే కావడం ఆసక్తికరం.
ఇదిలా ఉంటే, నిన్నటి మ్యాచ్‌లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్.. మిచెల్ మార్ష్ (49 బంతుల్లో 92 నాటౌట్; 13 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (28 బంతుల్లో 64; 7 ఫోర్లు, 4 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 226 పరుగులు చేసింది. అనంతరం 227 భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 115 పరుగులకే కుప్పకూలి ఓటమిపాలైంది. ఆస్ట్రేలియా బౌలర్లలో తన్వీర్ సంఘా 4 వికెట్లు, మార్కస్ స్టోయినిస్ 3 వికెట్లతో ప్రోటీస్‌ను దెబ్బతీశారు. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో హెండ్రిక్స్(56) మినహా అందరూ విఫలమయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment