PC: IPL.com
ఐపీఎల్-2023లో భాగంగా చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 3 పరుగుల తేడాతో రాజస్తాన్ రాయల్స్ విజయం సాధించింది. ఈ ఏడాది సీజన్‌లో ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో మూడింట విజయం సాధించిన రాజస్తాన్.. టేబుల్ టాపర్‌గా నిలిచింది. ఇక గెలుపు జోషల్‌లో ఉన్న రాజస్తాన్‌కు ఊహించని షాక్ తగిలింది. స్లో ఓవర్‌రేట్ కారణంగా రాజస్తాన్ కెప్టెన్ సంజూ శాంసన్‌కు జరిమానా విధించారు.
ఈ సీజన్‌లో రాయల్స్ చేసిన తొలి తప్పిదం కారణం శాంసన్‌కు 12 లక్షల రూపాయల జరిమానా మాత్రమే పడింది. సందీప్ శర్మ వేసిన చివరి ఓవర్ నిర్ణీత సమయంలో పూర్తి కాకపోవడంతో ఐపీఎల్ నిర్వహకులు ఫైన్ విధించారు. ఇదే తప్పు రెండోసారి జరిగితే రాజస్తాన్ కెప్టెన్ సంజూపై ఒక్క మ్యాచ్ నిషేధం పడనుంది.
ఇక ఈ ఏడాది సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్ ఫాఫ్ డు ప్లెసిస్ తర్వాత.. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన రెండవ కెప్టెన్‌గా శాంసన్ నిలిచాడు. కాగా ఐపీఎల్‌లో స్లో ఓవర్‌రేట్ కారణంగా శాంసన్‌కు జరిమానా విధించడం ఇదే తొలిసారి కాదు. అంతకుముందు 2021 సీజన్‌లో రెండు సార్లు అతడిపై ఫైన్ పడింది. ఇక ఈ మ్యాచ్‌లో సంజూ తీవ్రంగ నిరాశ పరిచాడు. జడేజా బౌలింగ్‌లో డకౌట్‌గా శాంసన్ వెనుదిరిగాడు.
చదవండి: IPL 2023: అదే మా ఓటమిని శాసించింది.. ఆ విషయం నాకు నిజంగా తెలియదు: ధోని
Comments
Please login to add a commentAdd a comment