పాకిస్తాన్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన తొలి టెస్టు ఫేలవ డ్రాగా ముగిసిన సంగతి తెలిసిందే. మ్యాచ్ కంటే పిచ్ తయారు చేసిన తీరు ఎక్కువ హైలెట్‌గా నిలిచింది. నాసిరకమైన పిచ్‌ను తయారు చేయడంతో ఐదురోజుల్లో ఒక్కసారి కూడా బౌలర్లకు సహకరించలేదు. దీంతో బ్యాట్స్‌మన్ పండగా చేసుకున్నారు. కనీసం రెండో టెస్టు జరగనున్న కరాచీలోని నేషనల్ స్టేడియం పిచ్‌ను ఫలితం వచ్చేలా తయారు చేయాలని ఫ్యాన్స్ విజ్ఞప్తి చేశారు.
ఇదిలా ఉంటే రెండో టెస్టు ఆడేందుకు కరాచీ చేరుకున్న ఇరుజట్ల ఆటగాళ్లు ప్రాక్టీస్‌ను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో పాక్ బౌలర్ షాహిన్ అఫ్రిది నెట్స్‌లో ఫాస్ట్ బౌలింగ్‌కు బదులు స్పిన్ బౌలింగ్‌తో ప్రాక్టీస్ చేయడం వైరల్‌గా మారింది. అయితే ఇక్కడ విశేషమేంటంటే.. అఫ్రిది.. టీమిండియా ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా బౌలింగ్‌ను కాపీ కొట్టడం హైలైట్‌గా నిలిచింది. జడ్డూలానే లెఫ్ట్ ఆర్మ్ స్పిన్ వేసి ఆశ్యర్యపరిచాడు. అఫ్రిది బంతి వేయగానే క్రీజులో ఉన్న బ్యాటర్ స్కూప్ షాట్ ఆడే ప్రయత్నంలో విఫలమయ్యాడు. దీంతో బంతి వికెట్లను గిరాటేసింది.
దీనికి సంబంధించిన వీడియోను భారత్ సుందరేషన్ అనే వ్యక్తి ట్విటర్‌లో షేర్ చేశాడు. ఇది చూసిన టీమిండియా అభిమానులు అఫ్రిదిపై ట్రోల్స్ వర్షం కురిపించారు. ''జడేజాను కాపీ కొట్టడానికి సిగ్గులేదా.. అచ్చం జడేజా బౌలింగ్ యాక్షన్‌ను దింపాడు.. కార్బన్ కాపీ కాట్.. షాహిన్ అఫ్రిది'' అంటూ ట్రోల్స్‌తో రెచ్చిపోయారు.
చదవండి: రోహిత్ శర్మపై దారుణమైన ట్రోల్స్.. చమీర‘సన్’ అంటూ మీమ్స్
PAK Vs AUS: టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యంత చెత్త పిచ్: ఐసీసీ
There’s a lot of Ravindra Jadeja, just a few inches taller, about Shaheen Shah Afridi bowling left-arm spin, the bounce in the hair included #PakvAus pic.twitter.com/6YCI99E9VV
— Bharat Sundaresan (@beastieboy07) March 10, 2022
Comments
Please login to add a commentAdd a comment